
సోహ అలీఖాన్‌కు ఏమైంది. ఆమె ఫొటోను చూసిన నెటిజన్లు ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఒకప్పటి బాలీవుడ్ నటి, సైఫ్ అలీఖాన్ పటౌడీ సోదరి సోహ అలీఖాన్ తాజాగా తన ముద్దుల కూతురు ఇనాయ నౌమీ కేముతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. లండన్‌లోని రద్దీ వీధుల్లో తీసిన ఈ ఫొటోలో స్ట్రోలర్‌పై ఇనాయ క్యూట్‌గా ఏదో అడుతుండగా.. పక్కన సోహ ఉన్నారు. ప్రస్తుతం పటౌడీ కుటుంబమంతా లండన్‌లో విహరిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ బ్యూటీఫుల్ ఫొటోలో సోహ లుక్‌పై నెటిజన్లు, ఆమె అభిమానులు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ముఖ్యంగా ఆమె మరీ సన్నగా కనిపించడం, వయసైన వృద్ధురాలి తరహాలో ముఖంపై ముడతలు ఉండటంతో అభిమానులు సోహకు ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఆమె ముసలి అవ్వలా కనిపిస్తోందని కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఎక్కువగా టెన్సన్ పడకండి.. ఆ టెన్షన్ ముఖంపై కనిపిస్తోందని మరికొందరు నెటిజన్లు సలహా ఇస్తున్నారు. మరికొందరు ఒక ఫొటో ఆధారంగా ఇలా ట్రోల్ చేయడం సరికాదని, ఇది బాడీషేమింగ్గేనని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment