సంతోషంగా...
‘‘రాష్ట్ర ప్రభుత్వం గతంలో సినిమా అవార్డులు ఇచ్చేది. రాను రాను మరచిపోయింది. కొన్ని ప్రైవేటు సంస్థలు అవార్డులు ఇచ్చినా కొద్దికాలం ఇచ్చి ఆపేశారు. సురేశ్ కొండేటి పద్నాలుగేళ్లగా అవార్డులు ఇస్తున్నాడు’’ అని దాసరి నారాయణరావు అన్నారు. ‘సంతోషం సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్’ వేడుకలు ఆదివారం జరిగాయి. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ సినిమా పరిశ్రమ నటీనటులకు, టెక్నీషియన్లకు అవార్డులు అందించారు. సంతోషం లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డును గిరిబాబు, తాళ్లూరి రామేశ్వరికి ఇచ్చారు.
ఏయన్నార్ స్మారక అవార్డు ను మురళీమోహన్, జీవన సాఫల్య పురస్కారా న్ని జయప్రద, అల్లు రామలింగయ్య స్మారక అవార్డును పృధ్వీ, డి. రామానాయుడు స్మారక అవార్డును ఎడిటర్ మోహన్ అందుకున్నారు. ఉత్తమ హీరోగా ప్రభాస్, నటిగా అనుష్క, నూతన హీరోగా అఖిల్, నూతన హీరోయిన్‌గా హెబ్బాపటేల్, ఉత్తమ చిత్రంగా ‘రుద్రమదేవి’, దర్శకుడిగా కొరటాల శివ, నిర్మాతలు గా శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, విలన్‌గా రానా, సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్.. ఇలా ఇతర విభాగాల్లో పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులను అవార్డుకి ఎంపిక చేశారు.