
హెడ్డింగ్ చదివి తప్పు రాశారేంటి అనుకుంటున్నారా? మ్యూజిక్ డైరెక్టర్ అని రాయాల్సింది పోయి మ్యూజిక్ డాక్టర్ అని రాయడానికి కారణం ఉంది. పూర్తిగా చదివితే విషయం మీకే అర్థం అవుతుంది. అద్భుతమైన సంగీతంతో కోట్లాది మంది శ్రోతల్ని అలరిస్తున్నారు ‘మేస్ట్రో’ ఇళయరాజా. ఇప్పటి వరకూ ఆయన సంగీతం మనసును పులకరింపజేసింది.
ఇకపై వివిధ జబ్బులను నయం చేయడంలో ఆయన సంగీతం కీలకంగా మారే అవకాశం ఉంది. వీనులవిందైన ఇళయరాజా సంగీతాన్ని వైద్యానికి ఉపయోగపడేలా మార్చేందుకు సింగపూర్‌కు చెందిన మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రి వారు కృషి చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆయన రూపొందించిన పాటల ఆల్బమ్స్ పై వారు పరిశోధనలు చేస్తున్నారు. ఇళయరాజా కూడా కొన్ని ప్రత్యేక బాణీలను సమకూర్చుతున్నట్లు టాక్.
Comments
Please login to add a commentAdd a comment