తమిళసినిమా (చెన్నై) : చెన్నైలో ఆదివారం నటి శ్రీదేవి సంతాపసభ నిర్వహించారు. నగరంలోని ఓ హోటల్‌లో శ్రీదేవి కుటుంబ సభ్యులు నిర్వహించిన ఈ సంతాప సభలో బోనీకపూర్, ఆయన కూతుళ్లు జాన్వీ, ఖుషీ, శ్రీదేవి చెల్లెలు శ్రీలత తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్, నటుడు శివకుమార్, సూర్య, జ్యోతిక, సీనియర్ నటి వైజయంతీమాల, బాలి, లత, మీనా, స్నేహా, కుట్టిపద్మిని, నృత్యదర్శకులు సుందరం, ప్రభుదేవా, నిర్మాత ఏఎం.రత్నం, కలైపులి ఎస్.థాను, టీజీ.త్యాగరాజన్, ఐసరి గణేశ్, దర్శకుడు కేఎస్.రవికుమార్, తంగర్‌బచ్చన్, లతా రజనీకాంత్, సుహాసిని, రోహిణి, రాధిక శరత్‌కుమార్, శ్రీరామ్, వందన, వినీత్ తదితరులు శ్రీదేవికి నివాళులు అర్పించారు. అమర్‌సింగ్, నిర్మాత సురేశ్‌బాబు కూడా నివాళులు అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment