
శ్రీదేవి కట్టుకున్న చీర దక్కించుకునే అవకాశం వస్తే.. పోటీ ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పక్కర్లేదు. వాడిన చీరకు డిమాండా? అని ఎవరూ అనుకోరు. ఎందుకంటే సెలబ్రిటీలకు ఆ రేంజ్‌లో క్రేజ్ ఉంటుందని అందరికీ తెలుసు. ఇక శ్రీదేవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె చనిపోయి ఈ 24కి ఏడాది అవుతోంది. ఈ సందర్భంగా శ్రీదేవి పేరు మీద ఏదైనా మంచి పని చేయాలని ఆమె భర్త బోనీకపూర్ అనుకున్నారు. ఓ సేవా సంస్థకు కొంత డబ్బుని విరాళంగా ఇవ్వాలనుకున్నారు.
ఇందులో భాగంగా శ్రీదేవి చీరను వేలానికి ఉంచారు. ఈ అతిలోక సుందరి ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఓ ‘కోటా చీర’ను ‘పరిసెరా’ వెబ్‌సైట్‌లో వేలానికి ఉంచారు. ఈ చీర ప్రారంభ వేలం ధరని రూ. 40 వేలకు నిర్ణయించగా మంగళవారం సాయంత్రానికి ధర రూ.90 వేలు çపలికింది. శ్రీదేవి వర్థంతి (ఫిబ్రవరి 24) నాటికి రికార్డు ధర పలుకుతుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment