నీటు ఫాదర్... నాటు సన్! | Srikanth's Natu kodi Movie | Sakshi
Sakshi News home page

నీటు ఫాదర్... నాటు సన్!

Published Fri, May 13 2016 11:39 PM | Last Updated on Thu, Aug 16 2018 4:30 PM

నీటు ఫాదర్... నాటు సన్! - Sakshi

నీటు ఫాదర్... నాటు సన్!

పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే తండ్రీకొడుకుల మధ్య సాగే సంఘర్షణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘నాటుకోడి’.  శ్రీకాంత్, మనోచిత్ర జంటగా నానిగాడి సినిమా పతాకంపై బందరు బాబ్జీతో కలిసి స్వీయదర్శకత్వంలో నానికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శక- నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘ఇందులో నిజాయతీ గల కానిస్టేబుల్‌గా తండ్రి పాత్రలో కోట శ్రీనివాసరావు, ఆయన కొడుకుగా అవినీతిపరుడైన పోలీసాఫీసర్ పాత్రలో శ్రీకాంత్ నటించారు. కథాకథనాలు ఆసక్తికరంగా ఉంటాయి’’ అని చెప్పారు. సంగీతం: యాజమాన్య, కెమెరా: మల్లేశ్ నాయుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement