అనుష్క కోసమే రూ.20 కోట్లు
రూ.20 కోట్లతో ఒక చిత్రాన్నే తీసేయొచ్చు. అలాంటిది నటి అనుష్కను స్లిమ్‌గా చూపించడానికే అంత పెద్ద మొత్తాన్ని ఖర్చు పెట్టారంటే నమ్మగలరా? అయితే నమ్మదగినట్టుగానే ఉంటుంది అసలు విషయం తెలిస్తే. ప్రపంచసినిమానే ఎదురు చూస్తున్న చిత్రం బాహుబలి–2. ఈ చిత్రం ఏప్రిల్ 28న కనీవినీ ఎరుగని రీతిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే ఇండియన్ సినిమా రికార్డులను బద్దలు కొట్టిన బాహుబలి చిత్ర సృష్టికర్త రాజమౌళి చెక్కిన మరో అద్భుత వెండితెర కళాఖండం బాహుబలి–2. ఇదంతా తెలిసిన విషయమే. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇందులో కథానాయకిగా నటించిన అనుష్కను మెరుగులు దిద్దడానికి దర్శకుడు రాజమౌళి రూ.20 కోట్లు ఖర్చు చేశారట.
ఇంతకీ అనుష్క అందగత్తే కదా, ఆమెకు మెరుగులు అవసరమా? అన్న సందేహం కలగవచ్చు.ఈ స్వీటీ బాహుబలి చిత్రంలో నటించిన తరువాత ఇంజి ఇడుప్పళగి చిత్రంలో నటించారు. అందులో పాత్ర కోసం అనుష్క సుమారు 80 కిలోలకు పైగా బరువు పెరిగారు. ఆ తరువాత బాహుబలి–2 చిత్రంలో నటించాల్సిన పరిస్థితి. దీంతో యుద్ధ ప్రాతిపదికపై బరువు తగ్గాల్సిన పరిస్థితి. అందుకు దర్శకుడు రాజమౌళి అనుష్కకు ఒక గడువు విధించారట. అయితే గడువైతే పూర్తి అయ్యిందిగానీ అమ్మడు బరువు మాత్రం తగ్గించలేకపోయారు. దర్శకుడు ఈమె కోసం ఇంకా వేచి ఉండలేక బరువైన అనుష్కతోనే షూటింగ్ చేశారు.
అయితే బాహుబలి చిత్రం సమయంలోనే దాని సీక్వెల్‌కు సంబంధించిన 40 శాతం వరకూ చిత్రీకరణను పూర్తి చేశారు. అందులో అనుష్కకు ఆ తరువాత అనుష్కకు చాలా తేడా కనిపించడంతో వేరే దారి లేక ఆమెకు సంబంధించిన సన్నివేశాలను రీషూట్ చేయడంతో పాటు అనుష్క రూపాన్ని డిజిటల్ టెక్నాలజీతో స్లిమ్‌గా తీర్చిదిద్దారట. ఇందుకుగానూ అదనంగా రూ. 20 కోట్లు ఖర్చు అయ్యిందట. చిత్రంలో అనుష్కది ప్రధాన పాత్ర కావడంతో నిర్మాతలు ఆ ఖర్చు భరించడానికి సిద్ధం అ య్యారనే ప్రచారం చిత్ర వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. మరి ఇది నమ్మదగేదిగానే ఉంది కదూ!