కలుసుకోని ఆత్మీయులం | Stan Lee's Final Video Message Is a Tribute to His Fans | Sakshi
Sakshi News home page

కలుసుకోని ఆత్మీయులం

Published Sun, Nov 18 2018 5:21 AM | Last Updated on Sat, Apr 6 2019 9:01 PM

Stan Lee's Final Video Message Is a Tribute to His Fans - Sakshi

స్టాన్‌ లీ

స్టాన్‌ లీ... కామిక్స్‌ ప్రపంచంలో ‘స్పైడర్‌ మేన్, ఐరన్‌ మేన్, హల్క్, డాక్టర్‌ స్ట్రేంజ్, కేప్టెన్‌ మార్వెల్‌’.. వంటి సూపర్‌ హీరోలు ఆయన ఊహల్లో పురుడు పోసుకున్నవాళ్లే. ఇటీవలే స్టాన్‌ లీ మర ణించిన సంగతి తెలిసిందే. కామిక్స్‌తో తమ బాల్యాన్ని ఊహల్లో విహరించేలా చేసిన వ్యక్తి చనిపోయాడని తెలుసుకొని తట్టుకోలేకపోయారు ఆయన అభిమానులు. స్టాన్‌ లీని అభిమానులు ఎంతగా ప్రేమించారో, అభిమానులను స్టాన్‌ లీ అంతే ప్రేమించారు. స్టాన్‌ లీ చనిపోయే కొన్ని రోజుల ముందు తన అభిమానుల కోసం ఒక వీడియోను రికార్డ్‌ చేశారు.

అందులో ఆయన ఫ్యాన్స్‌ గురించి మాట్లాడుతూ – ‘‘నా అభిమానులు నన్ను ఎంతగా ప్రేమిస్తారో, నేనూ వాళ్లను అంతే ప్రేమిస్తాను. మేం ఎప్పుడూ కలుసుకోని ఆత్మీయులం. మనల్ని పట్టించుకునే వాళ్లు ఉండటాన్ని మించిన అదృష్టం ఉండదు. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. ఫ్యాన్స్‌ వల్లే నాకీ స్టేటస్, నన్ను గొప్పవాడిని చేసింది వాళ్లే. నా ఫ్యాన్స్‌కి నేనెప్పటికీ రుణపడి ఉంటాను’’ అని పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోను చూసి స్టాన్‌ లీ అభిమానులు ఉద్వేగానికి గురవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement