
ఆండ్రూ జాక్
ప్రముఖ నటుడు, స్టార్ వార్స్ ఫేమ్ ఆండ్రూ జాక్ కరోనా వైరస్ బారిన పడి కన్నుమూశారు. రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ రావటంతో సర్రేలోని ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ప్రతినిధి జిల్ మెకలాగ్ బుధవారం అధికారికంగా ధ్రువీకరించారు. 76 ఏళ్ల జాక్ స్టార్ వార్స్ ఎపిసోడ్ 7,8లలో తన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. అంతేకాకుండా ప్రముఖ నటులు రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ హేమ్స్‌వర్త్‌లకు డయలెక్ట్ కోచ్( భాషకు సంబంధించిన మెలుకువలు నేర్పేవారు)గా కూడా వ్యవహరిస్తున్నారు.
ఆస్ట్రేలియాలో ఉన్న జాక్ భార్య గేబ్రియల్ రోజర్స్ ఆయన మృతిపై స్పందిస్తూ.. ‘‘ రెండు రోజుల క్రితం జాక్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. మంగళవారం ఎటువంటి బాధలేకుండా ప్రశాంతంగా కన్నుమూశార’ని పేర్కొన్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 9 లక్షల మంది కరోనా బారిన పడగా, 42వేల మంది మృతి చెందారు. ( మార్క్ బ్లమ్ ఇక లేరు )
Comments
Please login to add a commentAdd a comment