కొడెక్కైనాల్ లో కథ రాస్తున్న మణిరత్నం | story writing in kodaikenal :manirathnam | Sakshi
Sakshi News home page

కొడెక్కైనాల్ లో కథ రాస్తున్న మణిరత్నం

Published Sat, Mar 5 2016 4:10 AM | Last Updated on Sun, Sep 3 2017 7:00 PM

కొడెక్కైనాల్ లో కథ రాస్తున్న మణిరత్నం

కొడెక్కైనాల్ లో కథ రాస్తున్న మణిరత్నం

ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తన తాజా చిత్రానికి కొడెక్కైనాల్‌లో కథను వండుతున్నారు.కడల్ చిత్రం వరకూ కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఈ దర్శక రత్నం ఒరు కాదల్ కణ్మణి చిత్రంతో మళ్లీ విజయాల బాట పట్టారు. అయితే ఆ తదుపరి చిత్రానికి పలుమార్లు ప్రయత్నించినా సెట్ కాలేదు. ఒరు కాదల్ కణ్మణి చిత్రం తరువాత మణిరత్నం ఒక భారీ మల్టీస్టారర్ చిత్రానికి సిద్ధమయ్యారు.అయితే అనివార్య కారణాల వల్ల ఆ ప్రయత్నం ఫలించలేదు. అదే కథను కార్తీ,దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్‌లతో చేయాలనుకున్నా అదీ జరగలేదు.ఇక మల్టీస్టారర్ చిత్రం ప్రయత్నాన్ని పక్కన పెట్టి తాజాగా ఫ్రెష్‌గా కార్తీ, సాయిపల్లవిల కోసం ఒక కథను తయారు చేస్తున్నారు. ఇదీ విభిన్న ప్రేమ కథా చిత్రమేనని తెలిసింది.

ప్రస్తుతం కొడెక్కైనాల్‌లో ఈ కథకు మెరుగులు దిద్దుతున్న మణి మరో పది రోజుల వరకూ అక్కడే మకాం పెట్టి స్క్రిప్ట్‌ను రెడీ చేసి చెన్నైకి తిరిగిరానున్నట్టు తెలిసింది. తదుపరి చిత్ర సంగీతం,తదిరత ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలకు ఉపక్రమించనున్నట్లు సమాచారం. దీనికి మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ బాణీలు అందించనున్న విషయం తెలిసిందే. నటుడు కార్తీ కూడా తన గురువు మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ఇటీవలే అన్నారు.ప్రస్తుతం ఆయన నయనతార, నిత్యామీనన్‌లతో కలిసి కాష్మోరా చిత్రాన్ని పూర్తి చేసే పనితో ఉన్నారన్నది గమనార్హం. తదుపరి ఆయన నటించేది మణిరత్నం చిత్రంలోనేనన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement