
హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో సందీప్ కిషన్ మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దర్శకుడు నాగేశ్వర రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా గత డిసెంబర్ 4న ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ సినిమాను ప్రకటించారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హన్సిక హీరోయిన్‌గా నటించనుంది.
ఎస్‌ఎన్‌ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అగ్రహారం నాగిరెడ్డి, సంజీవు రెడ్డి నిర్మాతలు. శేఖర్ చంద్ర సంగీతమందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఈ రోజు (గురువారం) కర్నూలులో మొదలైంది. హీరో సందీప్ కిషన్, హన్సిక ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. మురళీ శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment