మంచు మనోజ్ సినిమాలో సన్నీ లియోన్ | Sunnu leone in Manchu Manoj movie | Sakshi
Sakshi News home page

మంచు మనోజ్ సినిమాలో సన్నీ లియోన్

Published Thu, May 15 2014 10:58 PM | Last Updated on Sat, Sep 2 2017 7:23 AM

మంచు మనోజ్ సినిమాలో సన్నీ లియోన్

మంచు మనోజ్ సినిమాలో సన్నీ లియోన్

ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం సంపాదించిన శృంగార తార సన్నీ లియోన్. అంగాంగ ప్రదర్శన పరంగా హద్దులు మీరడం సన్నీకి చాలా ఇష్టం. స్వతహాగా విదేశాల్లో నీలి చిత్రాల్లో నటించిన తార కాబట్టి, భారతీయ మసాలా సినిమాల్లో చేసే ఎక్స్‌పోజింగ్ ఆమెకో లెక్క కాదు. తొలి చిత్రం ‘జిస్మ్ 2’లో ఎక్స్‌పోజింగ్ పరంగా విజృంభించి, బాలీవుడ్‌లో హాట్ గాళ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అక్కడ ఓ స్థాయిలో దూసుకెళుతున్న సన్నీ ఇటీవల ‘వడకర్రీ’ అనే తమిళ చిత్రంలో ప్రత్యేక పాట చేశారు. ఈ హాట్‌గాళ్ తెలుగులో కూడా ఓ సినిమా అంగీకరించినట్లు సమాచారం. మంచు మనోజ్ హీరోగా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో సన్నీ ఓ కీలక పాత్ర చేయనున్నారట. ఈ చిత్రానికి ‘కరెంటు తీగ’ అనే టైటిల్‌ని ఖరారు చేశామని ట్విట్టర్ ద్వారా మనోజ్ తెలిపారు. ఛాయాగ్రాహకునిగా సతీష్, సంగీతదర్శకునిగా అచ్చు, కథానాయికగా రకుల్ ప్రీత్‌సింగ్ నటించనున్నారని ఆయన పేర్కొన్నారు. మరో ఇద్దరు ప్రముఖ వ్యక్తులు కూడా మా చిత్రబృందంలో ఉంటారని మనోజ్ అన్నారు. ఆ ఇద్దరిలో సన్నీలియోన్ ఉండి ఉంటారనే ఊహాగానాలు ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement