శృంగార కథలు రాస్తున్న హీరోయిన్‌! | Sunny Leone turns writer, pens short stories | Sakshi
Sakshi News home page

శృంగార కథలు రాస్తున్న హీరోయిన్‌!

Published Sat, Apr 23 2016 3:05 PM | Last Updated on Sun, Sep 3 2017 10:35 PM

శృంగార కథలు రాస్తున్న హీరోయిన్‌!

శృంగార కథలు రాస్తున్న హీరోయిన్‌!

ముంబై: వృత్తిపరంగా అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్న బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్‌ తాజాగా సరికొత్త అవతారం ఎత్తబోతున్నది. ఒకప్పుడు పోర్న్‌ మూవీ స్టార్‌గా ప్రస్థానం మొదలుపెట్టిన ఆమె.. డ్యాన్సర్‌గా, రియాల్టీ టీవీ హోస్ట్‌గా వివిధ పాత్రల్లో ఒదిగిపోయి.. చివరకి బాలీవుడ్ నటిగా స్థిరపడింది. వరుసగా ఘాటైన చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఈ 'మస్తీజాదే' భామ తాజాగా పెన్ను పట్టుకుంది. రచయితగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నది.

'స్వీట్‌ డ్రీమ్స్‌' పేరుతో 12 బెడ్‌టైమ్‌ చిన్నకథలను ఆమె రాసింది. ఎరోటిక్ ఫిక్షన్‌గా వస్తున్న ఈ కథలను జాగర్‌నట్‌ బుక్స్‌ ప్రచురణ సంస్థ ప్రచురిస్తున్నది. ఈ ఘాటైన పడకగది కథలు ప్రతిరోజూ రాత్రి జుగర్‌నట్‌ యాప్‌లో ప్రచురించనున్నారు. సన్నీ లియోన్‌ రాసిన తొలి కథను శనివారం రాత్రి ఈ యాప్‌లో పబ్లిష్‌  చేస్తారు.

తనకు కథలు రాయాలన్న ఆలోచన ఏమాత్రం లేదని, కానీ తనకు కొన్ని ఆలోచనలు వచ్చేవని, వాటిని రాస్తే బాగుండేదని అనే భావన ఉండేదని సన్నీ లియోన్ చెప్పింది. చిన్నప్పుడు తాను డైరీ రాసేదానిని, దానిని తన తల్లి చదుడంతో దానిని అక్కడితో ఆపేశానని తెలిపింది. కథలు రాయమని జాగర్‌నట్‌ బుక్స్‌ తనను కోరినప్పుడు సవాల్‌గా తీసుకొని మూడు నెలల్లో ఈ 12 కథలు రాశానని ఆమె తెలిపింది. భారతీయ నేపథ్యంతో కథలు సాగుతాయని, శృంగారంలో మహిళలను కూడా సమాన భాగస్వాములుగా చూడాలన్న అంతర్లీన భావన ఈ కథల్లో ఉంటుందని ఆమె చెప్పింది. ఘాటైన ఈ కథలు పడకగదిలో శృంగారం గురించే అయినప్పటికీ వల్గర్‌గా ఉండబోవని సన్నీ హామీ ఇస్తోంది. ఆమె రచయితగా ఏమేరకు సక్సెస్‌ అయితే చూడాలి అంటున్నారు పరిశీలకులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement