Sweet dreams
-
కథలు రాస్తున్న సన్నీలియోన్
బాలీవుడ్ హీరోయిన్గా మారిన సన్నీలియోన్, ఇప్పుడు మరో కొత్త అవతారంలో కనిపించనుంది. ఇప్పటివరకు నటిగా మాత్రమే అలరించిన ఈ బ్యూటీ త్వరలో రచయితగా ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతోంది. అయితే తన రచనల్లో కూడా తన మార్క్ ఉండేలా చూసుకుంటోంది సన్నీ. అందుకే తన ఇమేజ్‌కు తగ్గట్టుగా శృంగార కథలను అభిమానులకు అందించనుంది. స్వీట్ డ్రీమ్స్ పేరుతో తన కథలను రిలీజ్‌కు రెడీ చేస్తోంది ఈ బ్యూటీ. ఈ కథలను పుస్తకరూపంలోనే కాకుండా డైరెక్ట్‌గా మొబైల్ ఫోన్స్‌లో డౌన్ లోడ్ చేసుకునేలా ఢిల్లీలోని ఓ పబ్లిషింగ్ కంపెనీ ద్వారా రిలీజ్ చేస్తోంది. తనకు గతంలో రచనలు చేసిన అనుభవం లేకపోయినా తన కథలను పబ్లిష్ చేసేందుకు ముందుకొచ్చిన కంపెనీకి కృతజ్ఞతలు తెలియజేసింది. తన కథలు ఎక్కువగా మహిళల కోసం రాస్తున్నానని, మహిళలోని సున్నితత్వంతో పాటు, ఆమె నుంచి మగాడు ఏం కోరుకుంటాడన్న విషయాలను తన కథలలో తెలియజేస్తానంటోంది. ఇప్పటికే ఆన్లైన్ అతి ఎక్కువ సెర్చ్ చేస్తున్న పేరుగా రికార్డులు సృష్టిస్తున్న సన్నీలియోన్, ఈ కథలతో ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో..? -
సన్నీ... ఓ డజను ప్రణయకథలు
ప్రపంచవ్యాప్తంగా శృంగార తారగా పేరొంది, హిందీ సినిమాల్లో పాత్ర పోషణతో కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన నటి సన్నీ లియోన్ ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు. అయితే, ఈసారి నటిగా కాదు... రచయిత్రిగా! ‘స్వీట్ డ్రీమ్స్’ పేరిట 12 కథలతో ఒక పుస్తకం రాశారామె. ‘‘గతంలో ఎప్పుడూ రచయిత్రిని కావాలనే ఆలోచన నాకు లేదు. అయితే, ఇప్పటి వరకు బయటెక్కడా రికార్డు కాని కొన్ని ఆలోచనలు నాకున్నాయి. వాటిని పుస్తక రూపంలో పెట్టాలని ప్రయత్నించా’’ అని సన్నీ చెప్పుకొచ్చారు. ఆమె రచన చేయడం ఇదే తొలిసారి. ‘‘చిన్నప్పుడు నేను డైరీ రాసేదాన్ని. అప్పట్లో ఒకసారి మా అమ్మ నా డైరీ చదివింది. అంతే! ఇక డైరీ రాయడం మంగళం పాడేశా’’ అని ఆమె చెప్పారు. ఇంతకీ ఈ ‘స్వీట్ డ్రీమ్స్’ కథా సంపుటిలో ఏముంది? భారతీయ నేపథ్యంలో నడిచే ఈ కథల్లో అంతర్లీనంగా రొమాన్స్ కూడా ఉందట! మహిళల్ని భోగవస్తువులుగా చూస్తున్న పరిస్థితుల్ని ప్రస్తావించారట! ‘‘జగర్నాట్ బుక్స్ ప్రచురణ సంస్థ వారు నా దగ్గరకు వచ్చి, ఈ కోవలో ఉండే డజను ప్రణయకథలు రాయాల్సిందిగా అడిగారు. దాన్ని ఓ సవాలుగా తీసుకొన్నా. ఇవన్నీ రాయడానికి నాకు 3 నెలలు పట్టింది’’ అని సన్నీ చెప్పారు. మరి, రచయిత్రిగా కొత్త వేషంలో స్థిరపడడానికి ఆమె ఎంత శ్రమించారు? ‘‘మొట్టమొదట రాసింది కాబట్టి, ‘7ఇ’ అనే కథకు చాలా కష్టపడాల్సి వచ్చింది. రచనాశైలిని పట్టుకోవడానికి కొంత సమయం పట్టింది. ఇవన్నీ చిన్నకథలు కాబట్టి, ఒక్కోసారి కథ మొదలుపెడుతూనే అసలు విషయం లోకి వచ్చేయాల్సి ఉంటుంది. ఇది నిజంగా సవాలే! ఒక్కసారిగా హడావిడి గా ముందుకు వెళితే, పాఠకుడు గందరగోళపడే ప్రమాదం ఉంటుంది. అలా లేకుండా, అతణ్ణి చదివించేలా చేయడం కత్తి మీద సాము’’ అని ఆమె అన్నారు. ఇంతకీ, ఈ కథలకూ, సన్నీ నిజజీవితానికీ ఏమైనా లింక్ ఉందా అని సహజంగానే చాలామందికి అనుమానం. ‘‘నా నిజజీవితానికి సంబంధం లేదు. ఈ కథలన్నీ పూర్తిగా కల్పితం. ఇవన్నీ ప్రలోభపెట్టి, ప్రణయంలోకి దింపే కథలే అయినప్పటికీ, ఎక్కడా హద్దులు దాటలేదు. పాఠకులకు, ముఖ్యంగా మహిళా పాఠకులకు అసౌకర్యం అనిపించకుండా జాగ్రత్తపడ్డా. కొద్దిగా రొమాంటిక్‌గా అనిపించినా, ఆడవాళ్ళు ఎలాంటివి చదవడానికి ఇష్టపడతారనుకున్నానో అలాంటివే రాశా’’ అని అన్నారు. ఈ కథల పుస్తకం ప్రస్తుతానికి ‘ఇ-బుక్’ రూపంలో అందుబాటులోకి వస్తోంది. ప్రచురణకర్తలకు చెందిన ‘జగర్నాట్ యాప్’లో ప్రతి రాత్రీ 10 గంటలకు ఒక్కో కథ చొప్పున మే 3వ తేదీ దాకా విడుదల చేయనున్నారు. సన్నీకి సినిమాలు, పాటల రిలీజ్లు బాగా అలవాటే కానీ, ఈ కథల సంపుటి రిలీజ్ మాత్రం కొత్తగా ఉంది. ‘‘సినిమాలు వేరు, ఈ కథలు వేరు. రచన అనేది మనసుకు దగ్గరైన వ్యక్తిగత విషయం కదా! నాకు కాస్తంత భయం వేస్తోంది’’ అని ఆమె అన్నారు. -
శృంగార కథలు రాస్తున్న హీరోయిన్!
ముంబై: వృత్తిపరంగా అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్న బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్ తాజాగా సరికొత్త అవతారం ఎత్తబోతున్నది. ఒకప్పుడు పోర్న్ మూవీ స్టార్‌గా ప్రస్థానం మొదలుపెట్టిన ఆమె.. డ్యాన్సర్‌గా, రియాల్టీ టీవీ హోస్ట్‌గా వివిధ పాత్రల్లో ఒదిగిపోయి.. చివరకి బాలీవుడ్ నటిగా స్థిరపడింది. వరుసగా ఘాటైన చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఈ 'మస్తీజాదే' భామ తాజాగా పెన్ను పట్టుకుంది. రచయితగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నది. 'స్వీట్ డ్రీమ్స్' పేరుతో 12 బెడ్‌టైమ్ చిన్నకథలను ఆమె రాసింది. ఎరోటిక్ ఫిక్షన్‌గా వస్తున్న ఈ కథలను జాగర్‌నట్ బుక్స్ ప్రచురణ సంస్థ ప్రచురిస్తున్నది. ఈ ఘాటైన పడకగది కథలు ప్రతిరోజూ రాత్రి జుగర్నట్ యాప్‌లో ప్రచురించనున్నారు. సన్నీ లియోన్ రాసిన తొలి కథను శనివారం రాత్రి ఈ యాప్‌లో పబ్లిష్ చేస్తారు. తనకు కథలు రాయాలన్న ఆలోచన ఏమాత్రం లేదని, కానీ తనకు కొన్ని ఆలోచనలు వచ్చేవని, వాటిని రాస్తే బాగుండేదని అనే భావన ఉండేదని సన్నీ లియోన్ చెప్పింది. చిన్నప్పుడు తాను డైరీ రాసేదానిని, దానిని తన తల్లి చదుడంతో దానిని అక్కడితో ఆపేశానని తెలిపింది. కథలు రాయమని జాగర్‌నట్ బుక్స్ తనను కోరినప్పుడు సవాల్‌గా తీసుకొని మూడు నెలల్లో ఈ 12 కథలు రాశానని ఆమె తెలిపింది. భారతీయ నేపథ్యంతో కథలు సాగుతాయని, శృంగారంలో మహిళలను కూడా సమాన భాగస్వాములుగా చూడాలన్న అంతర్లీన భావన ఈ కథల్లో ఉంటుందని ఆమె చెప్పింది. ఘాటైన ఈ కథలు పడకగదిలో శృంగారం గురించే అయినప్పటికీ వల్గర్‌గా ఉండబోవని సన్నీ హామీ ఇస్తోంది. ఆమె రచయితగా ఏమేరకు సక్సెస్ అయితే చూడాలి అంటున్నారు పరిశీలకులు. -
గుడ్ స్లీప్.. స్వీట్ డ్రీమ్స్
పొద్దుట్నుంచీ కంప్యూటర్‌కు అతుక్కుపోయిన కళ్లు రాత్రయినా మూతపడనంటున్నాయ్. రేపటి మీటింగ్లూ, ప్లాన్లతో వేడెక్కిపోయిన మెదడు ఆలోచనల చట్రం నుంచి బయటకు రానంటోంది. ఏసీలూ, కుషన్ సీట్ల పుణ్యాన అలసట రుచి ఎరుగని శరీరం విశ్రాంతికి సిద్ధమవ్వడం లేదు. వెరసి.. కునుకు ప్రియమవుతోంది. ఆరోగ్యంగా జీవించడానికి అవసరమైన 8 గంటల నిద్ర అనేది అందని ద్రాక్షే అవుతోంది. అన్ని సౌకర్యాలు ఉండి కూడా కాసింత నిద్రకు నోచుకోని కోటీశ్వరులు, ఉన్నతోద్యోగులు చాలామంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. నిద్ర కోసం మందే మందు అనుకునే మందుబాబులు, నిద్రమాత్రలు, మత్తు ఇంజెక్షన్లతో నిద్రకు దగ్గర కావాలని ఆరాటపడేవారు కోకొల్లలు. అందుకే బ్యాంక్ బాలెన్సులున్న కుబేరుల కన్నా కంటి నిండా నిద్రపోగలిగిన పేదవాడే అధిక సంపన్నుడని అంటుంటారు. -విశాఖ కల్చరల్/ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) ‘నిద్ర సుఖమెరుగదు’ అన్నారు పెద్దలు. ‘అసలు సుఖనిద్ర అనేదే మేమెరుగం’ అంటున్నారు ఆధునికులు. రోజువారీ లక్ష్యాల మధ్య సరైన నిద్ర కోసం అల్లాడుతున్న నగరవాసులు... ‘నిదురమ్మా... నువ్వెక్కడమ్మా..!’ అంటూ అన్వేషిస్తున్నారు. నిద్రాభంగానికి గురవుతున్న వారిలో వారు వీరని తేడా లేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి శాస్త్రవేత్తల దాకా, డిజైనర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్ల వరకు ప్రతి ఒక్కరిదీ ఇదే పరిస్థితి. దీనికి కారణాలను నిపుణులు ఇలా విశ్లేషిస్తున్నారు... ప్రతి రంగంలోనూ పోటీ తీవ్రమవుతుండడం, విజయాలు సాధించాలనే తపన, తరచుగా లక్ష్యాలను పెంచుకుంటూ పోవడం... ఇలాంటి కారణాల వల్ల మెదడు సామర్థ్యానికి మించి పనిచేయాల్సి రావడం... వ్యక్తిని మానసికంగా తీవ్రమైన అశాంతికి గురిచేస్తున్నాయి. పొద్దస్తమానం అలజడికి అలవాటుపడిన మనసు మంచం ఎక్కగానే ఒక్కసారిగా మత్తులోకి జారిపోవడం కష్టం. మరోవైపు సమయానికి నిద్ర రాకపోతే రేపు లేవడం ఆలస్యమవుతుందని, పనులు సరిగా చేయలేమేమోననే ఆందోళన మరింతగా కునుకును దూరం చేస్తోంది. అలాగే శరీరానికి అవసరమైన కనీస శ్రమ లేకపోవడం, చెమట పట్టే పనులు చేయకపోవడం వల్ల రక్తప్రసరణ సమస్యలు ఏర్పడడం, విశ్రాంతి పొందాలనేంత పరిస్థితిని శరీరానికి కల్పించకపోవడం, టీవీలు, కంప్యూటర్లకు గంటల తరబడి కళ్లను అప్పగించడం... ఇవన్నీ మంచి నిద్రను దూరం చేసే కారణాలే. రోడ్డు ప్రమాదాల్లో కీలక పాత్ర380 రోడ్డు ప్రమాదాలను కేస్‌గా తీసుకుని ఇటీవల ఎయిమ్స్ ఓ స్టడీని నిర్వహించింది. వీటికి కారణమైన కమర్షియల్ డ్రైవర్స్‌కు నిద్ర వేళలు సరిగా లేవని గుర్తించారు. వీరిలో 60 శాతం మంది అంతకు ముందురోజు రాత్రి సరిగా నిద్రపోలేదని తేలింది. ఆరోగ్య నిద్రకు ఇవిగో మార్గాలు సాధారణంగా ప్రతి మనిషికి ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. ఇది నిరంతరాయంగా ఈ నిద్ర నిరంతరాయంగా ఉండాలి. పగలు కాస్సేపు రాత్రి కాస్సేపు పడుకుని ఆరుగంటలు పడుకున్నాం కదా అని భావించకూడదు. కొందరు అంతరాయంగా నిద్రపోతుంటారు. తరచూ లేస్తుంటారు. కొందరు ఆలస్యంగా పడుకుని ఆలస్యంగా లేస్తుంటారు. కొందరు వేకువజామున మరీ తొందరగా లేస్తుంటారు. ఏమైనప్పటికీ నిద్రను నిర్దిష్టసమయంలో బయోలాజికల్ క్లాక్లా అలవాటు చేసుకోవాలి. నిద్ర లేమి వల్ల మానసిక సమతుల్యత దెబ్బతింటుంది. నిత్యజీవనంపై దీనిప్రభావం కనిపిస్తుంది. మానసిక శారీకర రుగ్మతలకు హేతవు అవుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మేలు నిద్ర పట్టకుండా చేసే కాఫీ..టీలు పరిహరించాలి మసాలాతో కూడిన ఆహారం రాత్రి పూట భుజించ కూడదు. తేలికపాటి ఆహారం ఉత్తమం పడుకునే ముందు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి నిద్ర సమయంలో మెదడుకు పెద్దగా పనిచెప్పకూడదు. టీవీలు చూడటం లాంటివి మంచివి కాదు. సాయంత్రం కాస్సేపు నడిస్తే ప్రశాంతంగా నిద్రపడుతుంది. పడక గది కూడా మన అభిరుచికి అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. నిద్రమాత్రలకు దూరంగా ఉంటే మంచిది. -డాక్టర్ ఎన్.ఎన్.రాజు మానసిక వైద్య నిపుణుడు సర్వేలు ఏం చెబుతున్నాయంటే.. తాజాగా ఏసీ నీల్సన్-ఫిలిప్స్ సంస్థలు విశాఖపట్నం, హైదరాబాద్‌తోసహా 25 నగరాలలో సర్వే నిర్వహించాయి. 35 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కుల్లో నిర్వహించిన దీని ఫలితాల ప్రకారం... నగరాల్లో 93 శాతం మంది 8 గంటల నిద్రకు నోచుకోవడం లేదు. విచిత్రమేమిటంటే వీరిలో 2 శాతం మంది మాత్రమే తమ నిద్రలేమి గురించి వైద్యులతో ప్రస్తావిస్తున్నారు. దీనివల్ల 15 శాతం మంది ఏకాగ్రత లోపానికి గురవుతుంటే... 62 శాతం మంది అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా... అనే (నిద్ర కరవైతే వచ్చే అనారోగ్యం) సమస్య బారిన పడతున్నారు. నిద్ర సరిగా లేక తమ పని పాడవుతోందని వీరిలో 58 శాతం మంది అంటున్నారు. ఇక 11 శాతం మంది పనిచేసే సమయంలో నిద్ర కమ్మేస్తోందని అంటున్నారు. నిద్రపోయే సమయంలో 1 నుంచి 3 సార్లు మెలకువ వస్తోందని 72 శాతం మంది చెప్పడం ద్వారా తమది కలత నిద్ర అని చెప్పకనే చెప్పారు. -
జ్ఞాపకం.. కళకాలం
జీవితంలో దారి తప్పిన మధుర జ్ఞాపకాలు.. కలకాలం గుర్తుండిపోతే ఎంత బాగుంటుంది. మనసు పొరల్లో దాక్కున్న స్పందనలు ప్రతిరోజూ సాక్షాత్కరిస్తే ఎంత హాయిగా ఉంటుంది. అలాంటి అనుభవాలనే పంచుతోంది ఇమ్ప్రింట్స్. గడచిపోయిన క్షణాలకు ఛాయ.. ఫొటో అయితే, అనుభూతులకు స్వచ్ఛమైన రూపం.. ఇమ్ప్రింట్స్! ఇమ్ప్రింట్స్.. ఇప్పుడు నగరంలో నయాట్రెండ్. కన్నబిడ్డలకు అపూర్వ కానుక ఇవ్వాలనుకుంటున్న తల్లిందండ్రులకు ఈ కళ ఒక వరం. ఇమ్ప్రింట్స్తో ఎన్నేళ్లయినా మీ మధుర స్మృతులు కళాత్మకంగా మిమ్మల్ని స్పృశిస్తాయి. ఆ చిట్టి చేతుల ముద్రలను తాకితే.. ఎప్పుడో పొట్టి చేతులు మీ బుగ్గ నిమిరిన జ్ఞాపకాన్ని నెమరువేసుకోవచ్చు. చిట్టి పాదాల ఆనవాళ్లు ముట్టుకుంటే.. మీ గుండెలపై ఒకనాడవి చేసిన బాలతాండవం అనుభవంలోకి వస్తుంది. మీ గారాల పట్టి కొనగోటి ఆనవాళ్లు.. మీకు కోటి రూకల నకళ్లవుతాయి. కదిలే కాలానికి సంకెళ్లు గతంలో పుత్రోత్సాహం కలిగిన త ల్లిదండ్రులు వారి ఆనందాన్ని పదిమందితో పంచుకునేవారు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని చిట్టితల్లి రూపాన్ని క్లిక్ మనిపించేవారు. కొత్తదనం కోరుకునే తల్లిదండ్రులు ప్రతి నెలా పిల్లల ఫొటోలు తీసి.. మొదటి పుట్టిన రోజు వేడుకలో తమ అంశ ఇలా.. ఇలా.. ఎదిగిపోయిందంటూ అన్ని ఫొటోలతో ఫ్లెకీ ్స వేయిస్తుంటారు. ఇప్పుడు.. ఇమ్ప్రింట్స్ వాటన్నింటినీ మించిపోతోంది. తల్లిదండ్రులకు, పిల్లలకు చెప్పలేని తీపి జ్ఞాపకాలు బహుమతిగా ఇస్తోంది. అపు‘రూప కళ’యిక మీ చిన్నారుల చిట్టి చేతులను, పొట్టి పాదాలను క్లేలో అద్దించి.. వాటికి ప్రతిరూపాలు తయారు చేయడమే ఇమ్ప్రింట్స్ ప్రత్యేకత. 2డీ, 3డీ రూపంలో వీటిని రూపొందిస్తున్నారు. క్లేలో అద్దడం ద్వారా 2డీ ఆనవాళ్లు చిరస్థాయిగా నిలబడితే.. 3డీలో అయితే అన్ని కోణాల్లోనూ చూసుకునే అవకాశం ఉంటుంది. బుడతల హస్త, పాద ముద్రలే కాదు.. ఏ వయసువారైనా ఈ కళతో వారి చేతులు, పాదాలను కళాత్మక రూపంలో చూసుకోవచ్చు. గ ర్భిణీ స్త్రీలు సైతం నెలల వారీగా శరీరంలో జరుగుతున్న పరిణామాలను ఇమ్ప్రింట్స్ ద్వారా అపురూపంగా దాచుకుంటున్నారు. అనుబంధాలకు ఆనవాళ్లు ఈ విధానంలో మొదట అర చే తులు, పాదాలు శుభ్రం చేస్తారు. తర్వాత క్లేలో అద్దుతారు. ఐదు నుంచి పది నిమిషాల్లో క్లే ఎండిపోయి రూపం స్పష్టంగా ఏర్పడుతుంది. దానిని అందమైన ఫొటో ఫ్రేమ్‌లో బంధిస్తే మీ ఆనవాళ్లు అలా నిలిచిపోతాయి. ఇక 3డీలో అరచేతులకు, పాదాలకు నమూనాలు తీసుకుని వాటికి కాస్టింగ్ ద్వారా తుది రూపాన్ని ఇస్తారు. చేతులు, పాదాలకు వ్యాజిలిన్ రాసి, కాస్త వెచ్చగా ఉన్న ప్లాస్టర్ స్లిప్‌లను పొరలుగా చుడతారు. అవి పొడిగా మారడానికి ఓ ఐదు నిమిషాల సమయం పడుతుంది. తర్వాత వాటిని జాగ్రత్తగా విడదీసి, ఆ నమూనాలకు కాంక్రీట్, ప్లాస్టర్, కే ్ల, డెంటల్ వైట్ సిమెంట్ అప్లై చేసి.. అనుకున్న రూపం తీసుకువస్తారు. తర్వాత ముద్రలకు అందమైన రంగులద్ది.. మరింత అందంగా ఆవిష్కరిస్తారు. ఎప్పటికీ నిలిచిపోతాయి గతంలోని తీపి జ్ఞాపకాలను ఎక్కడో మరచిపోకుండా జాగ్రత్త చేసేదే ఇమ్ప్రింట్స్ ఆర్ట్. ఈ ఆర్ట్‌లో ఎలాంటి హానీ చేయని ఎకో ఫ్రెండ్లీ ముడి సరుకునే వాడతాం. పైగా నమూనాలు తీసుకునేటప్పుడు ఎలాంటి బాధ ఉండదు. గర్భిణిలు కూడా ఈ విధానంపై ఆసక్తి కనబరుస్తున్నారు. నెలల వారీగా కాస్టింగ్ ద్వారా ఆనవాళ్లు దాచుకుంటున్నారు. తమ శరీరంలో జరుగుతున్న పరిణామాలను ప్రత్యక్షంగా చూసుకోవడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇమ్ప్రింట్స్ ద్వారా అరుదైన బహుమతి అందించే అవకాశం లభిస్తుంది. - భాను, హ్యాపీ ఇమ్ప్రింట్స్ - శిరీష చల్లపల్లి