‘కరెంట్’ దర్శకుడితో సుకుమార్ సినిమా | Suryapratap palnati directs Sukumar movie | Sakshi
Sakshi News home page

‘కరెంట్’ దర్శకుడితో సుకుమార్ సినిమా

Published Fri, Nov 15 2013 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM

Suryapratap palnati directs Sukumar movie

సృజనాత్మక దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి, పలు చిత్రాలు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సుకుమార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై తొలి ప్రయత్నంగా ‘కరెంట్’ దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించబోతున్నారు. థామస్ రెడ్డి ఆదూరితో కలిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ఇదో నూతన ప్రేమకథా చిత్రమనీ నటీనటుల ఎంపిక పూర్తయ్యిందనీ డిసెంబర్‌లో షూటింగ్ ప్రారంభిస్తామని సుకుమార్ తెలిపారు. ఈ చిత్రానికి కళ: సత్య, కూర్పు: రవి మన్ల, కెమెరా: చంద్రమౌళి, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: సూర్యప్రతాప్ పల్నాటి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement