అభిమాని పెళ్లి వేడుకకు స్టార్ హీరోయిన్ | Taapsee to attend fans wedding in secunderabad | Sakshi
Sakshi News home page

అభిమాని పెళ్లి వేడుకకు స్టార్ హీరోయిన్

Published Tue, Feb 21 2017 11:37 AM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM

అభిమాని పెళ్లి వేడుకకు స్టార్ హీరోయిన్

అభిమాని పెళ్లి వేడుకకు స్టార్ హీరోయిన్

టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తరువాత బాలీవుడ్ బాట పట్టిన బ్యూటి తాప్సీ. తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. బాలీవుడ్లో మాత్రం సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటిస్తోంది ఈ భామ. తాజాగా మల్టీ లింగ్యువల్ సినిమాగా తెరకెక్కిన ఘాజీతో మరోసారి ఆకట్టుకున్న తాప్సీ గురించి ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది.

తాప్సీ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి తనతో మెయిల్స్ ద్వారా టచ్లో ఉన్న ఓ అభిమాని పెళ్లి వేడుకకు తాప్సీ  హాజరుకానుందట. వచ్చే నెల సికింద్రాబాద్లో జరుగనున్న ఈ వేడుక కోసం తాప్సీ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చేందుకు రెడీ అవుతోంది. తాప్సీ ఫ్యాన్స్ క్లబ్లో భాగమైన ఆ అభిమాని ఎవరన్న విషయం మాత్రం ఇంత వరకు బయటకు రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement