తాప్సీ... చెబుతున్నదొకటి! చేస్తున్నదొకటి! | Taapsee wants to have a low key wedding | Sakshi
Sakshi News home page

తాప్సీ... చెబుతున్నదొకటి! చేస్తున్నదొకటి!

Published Wed, Jul 22 2015 11:14 PM | Last Updated on Sun, Sep 3 2017 5:58 AM

తాప్సీ... చెబుతున్నదొకటి! చేస్తున్నదొకటి!

తాప్సీ... చెబుతున్నదొకటి! చేస్తున్నదొకటి!

నటి తాప్సీ పేరు చెప్పగానే ఇప్పుడు సినిమాలతో పాటు వివాహ వేడుకల ప్లానింగ్ వ్యాపారం కూడా గుర్తుకొస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకున్న ఈ తారక ఇటు సినిమాల్లో చేస్తూనే, ఈ పెళ్ళిళ్ళ ప్లానింగ్ పని చేపట్టింది. అందరి పెళ్ళిళ్ళూ ఆర్భాటంగా చేసి, నాలుగు రాళ్ళు వెనకేసుకొనే వ్యాపారం నడుపుతున్నప్పటికీ, తాప్సీ సొంత పెళ్ళి కోరిక మాత్రం విచిత్రంగా ఉంది. పెళ్ళి విషయంలో తనకే గనక అవకాశమిస్తే... హంగూ ఆర్భాటాలకు దూరంగా, అత్యంత సన్నిహితులు, ముఖ్యుల మధ్య సాదాసీదాగా మూడుముళ్ళూ వేయించుకుంటుందట! ‘‘మేము ఏం చేసినా, అనుక్షణం మా మీద బోలెడన్ని కెమేరాలు ఫోకసై్స ఉంటాయి.

 కానీ, ఎంత పేరున్న పబ్లిక్ ఫిగర్‌లమైనా, కొన్ని ప్రత్యేక్ష క్షణాలను మా కుటుంబం, స్నేహితుల మధ్యే గడపాలని కోరుకుంటాం కదా! కాబట్టి, నాకే గనక ఛాయిస్ ఇస్తే, మొన్నామధ్య జరిగిన షాహిద్ కపూర్ పెళ్ళి లాగా, ఆర్భాటాలేమీ లేకుండా సాదాసీదాగా లాగించెయ్యాలని ఉంది’’ అని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పుడిప్పుడే పెళ్ళి చేసుకొనే ఉద్దేశమేదీ లేదనీ, కొన్నేళ్ళ తరువాతే ఆ ముచ్చట అనీ ప్రకటించేశారు. ‘‘పెళ్ళికి పక్కాగా ప్లాన్ చేస్తా. అందంగా అలంకరించుకుంటా. అంతా బాగా చేస్తా కానీ, హడావిడి లేకుండా మామూలుగా కానిచ్చేస్తా’’ అని తాప్సీ నవ్వేశారు.

నిజానికి, తాప్సీ తన చెల్లెలితోనూ, ఆప్త మిత్రురాలు ఫరాతోనూ కలిిసి సదరు పెళ్ళి ఏర్పాట్ల ప్లానింగ్ కంపెనీ నడుపుతున్నారు. హిందీ సినిమా ‘రన్నింగ్ షాదీ డాట్‌కామ్’లో నటిస్తున్నప్పుడు ఈ వ్యాపారం ఆలోచన ఆమెకు వచ్చిందట! ఆలోచన మంచిదే... ఖర్చు, హంగామా లేని పెళ్ళి చేసుకోవాలన్న అభిప్రాయమూ మంచిదే... కానీ, ఆ మాట పబ్లిక్‌లో చెప్పేస్తే వ్యాపారం మాట ఏం కానూ! బహుశా బిజినెస్ సూత్రాలు అమ్మడికి ఇంకా పట్టుబడినట్లు లేవు!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement