నేను చాలా అదృష్టవంతురాల్ని! | Tamanna Bhatia A Value Addition To Baahubali: Rajamouli | Sakshi
Sakshi News home page

నేను చాలా అదృష్టవంతురాల్ని!

Published Sat, Jun 28 2014 11:35 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

నేను చాలా అదృష్టవంతురాల్ని! - Sakshi

నేను చాలా అదృష్టవంతురాల్ని!

తమన్నా చాలా సంతోషంగా ఉన్నారు. ఆమె నటించిన హిందీ చిత్రం ‘హమ్‌షకల్స్’ పరాజయం పాలైంది కదా.. ఆనందంగా ఉండటమేంటి అనుకుంటున్నారా? ‘హమ్‌షకల్స్’ మూడ్ నుంచి తమన్నా బయటికొచ్చేశారు. ఇప్పుడామె యువరాణిగా అవంతికగా మారిపోయారు. ఈ రాణీవాసం అనుభవిస్తున్నది ‘బాహుబలి’ చిత్రం కోసం. రాజమౌళి దర్శకత్వంలో అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ సరసన తమన్నా నటిస్తున్నారు. ఇటీవలే తమన్నా పాత్ర చిత్రీకరణ మొదలైంది.
 
  రాజమౌళి దర్శకత్వంలో నటించాలనే కల నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని కూడా ఆమె అన్నారు. ఈ ఆనందాన్నంతా ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు తమన్నా. అదే ట్విట్టర్ ద్వారా తమన్నాపై రాజమౌళి ప్రశంసలు కురిపించారు. తమన్నాతో తాను చేస్తున్న మొదటి సినిమా ఇదని, సన్నివేశాలను తను ఆకళింపు చేసుకుంటున్న తీరు చాలా అభినందనీయంగా ఉందని, అభినయం అయితే సూపర్బ్ అనీ రాజమౌళి పేర్కొన్నారు. తమన్నా నటించడం ద్వారా ‘బాహుబలి’కి అదనపు విలువ వచ్చిందని కూడా తెలిపారు. దీన్నిబట్టి, ఈ స్టార్ డెరైక్టర్‌ని తమన్నా ఎంత ఇంప్రెస్ చేసి ఉంటారో ఊహించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement