'బాహుబలి'లో మిల్క్ బ్యూటీ | Tamanna in Bahubali | Sakshi
Sakshi News home page

'బాహుబలి'లో మిల్క్ బ్యూటీ

Published Fri, Dec 20 2013 6:23 PM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM

'బాహుబలి'లో మిల్క్ బ్యూటీ

'బాహుబలి'లో మిల్క్ బ్యూటీ

హైదరాబాద్: యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'బాహుబలి'కి సంబంధించిన మరో ఆసక్తికర విషయం వెల్లడయింది. మిల్క్ బ్యూటీ తమన్నా కూడా ఈ సినిమాలో ఓ హీరోయిన్ నటిస్తోంది. రేపు (డిసెంబర్ 21) తమన్నా పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని నిర్మాతలు వెల్లడించారు.

ఈ సినిమాలో ప్రభాస్ బాహుబలిగా, శివుడిగా రెండు పాత్రల్లో నటిస్తున్నాడు. బాహుబలి సరసన అనుష్క నటిస్తుండగా, శివుడు సరసన తమన్నా  నటిస్తోంది. రాజమౌళి సినిమాలో తమన్నా నటించడం ఇదే మొదటిసారి కావడం మరో విశేషం. మొత్తానికి ఈ బర్త్ డేకి తమన్నా మంచి బహుమతే లభించిందని చెప్పొచ్చు. తమన్నా ఇంతకుముందు 'రెబల్'లో ప్రభాస్ సరసన నటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement