
జూబ్లీహిల్స్: ప్రముఖ నటి తమన్నా భాటియా శుక్రవారం పార్క్‌హయత్ హోటల్‌లో సందడి చేశారు. సిగ్నేచర్ మాస్టర్ క్లాస్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. బాహుబలి చిత్రం తన పాత్రల ఎంపికలో మార్పు తెచ్చిందని, ప్రస్తుతం కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా అర్థవంతమైన పాత్రలు ఎంపిక చేసుకోవడానికి ప్రాముఖ్యత ఇస్తున్నట్లు తెలిపారు. తాను చాలా సాధారణ అమ్మాయిగానే భావిస్తుంటానని, నటి, సెలబ్రిటీ అనే విషయమే తనకు గుర్తుండదన్నారు. తాను చదువుకునే రోజుల్లో సెల్‌ఫోన్ గొడవ లేదన్నారు. అప్పట్లో తనకు నటీమణులు శ్రీదేవి, మాధురి దీక్షిత్ తదితరులు ఆదర్శమని, వారి నటనచూసే సినీ రంగానికి వచ్చానన్నారు. ప్రస్తుతం సంపత్‌నంది చిత్రంలో నటిస్తున్నానని తెలిపారు. పూర్తిస్థాయిలో నృత్య ప్రధాన చిత్రం చేయాలని ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment