కరోనా వైరస్ (కోవిడ్-19) కారణంగా బాలీవుడ్ సినీ ప్రముఖులు స్వీయ నిర్భందంలో భాగంగా ఇంటికే పరిమితమయ్యారు. అదేవిధంగా దేశ ప్రజలు, అభిమానులకు కరోనా వైరస్‌ను ఎదుర్కొవడానికి పలు సూచనలు, సలహాలను ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ‘తారక్ మెహతా కా ఓల్తా చాష్మా’ కామెడీషో నటుడు తన్మయ్ వెకారియా తను నివసించే బిల్డింగ్‌ను అధికారులు సీల్ చేశారని తెలిపారు. తను నివసించే బిల్డింగ్‌లో ఓ కురగాయల వ్యాపారి, మరో ముగ్గురికి కరోనా వైరస్ (కోవిడ్-19) పాజిటివ్ నిర్దారణ అయినట్లు పేర్కొన్నారు. ఈ భవనం 14 రోజలు పాటు స్వీయ నిర్భందంలో ఉండనుందని చెప్పారు. తను నివాసం ఉండే భవనంలో చేటు చేసుకున్న పరిస్థితిని చూస్తే ప్రతి ఒక్కరు భయంతో వైరస్ నుంచి తమ కుటుంబాన్ని కాపాడుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. (కరోనాతో హాలీవుడ్ నటి మృతి)
బిల్డింగ్‌ను సీల్ చేయాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తూ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు తన్మయ్ వెకారియా అభినందనలు తెలిపారు. బిల్డింగ్ మొత్తాన్ని బీఎంసీ అధికారులు సానిటైజర్‌తో స్ప్రే చేశారని చెప్పారు. దీంతో తన్మయ్ వెకారియా ముందు జాగ్రత్తగా స్వీయ నిర్భందంలోకి వెళ్లినట్లు తెలిపారు. అదేవిధంగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారు ఎటువంటి ప్రయాణాలు చేయలేదని ఆయన పేర్కొన్నారు. వైరస్ బాధితులు చికిత్స కోసం సెవన్‌హిల్స్ ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. వైరస్ సోకిన బాధితులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 7,447 కరోనా వైరస్ కేసులు నమోదుకాగా, అందులో 239 మంది మృతి చెందారు. ఇక 642 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 6,565 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment