లక్ష్యాన్ని మించే స్థాయిలో... | Target   To grow ... | Sakshi
Sakshi News home page

లక్ష్యాన్ని మించే స్థాయిలో...

Published Thu, Mar 20 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 4:55 AM

లక్ష్యాన్ని  మించే స్థాయిలో...

లక్ష్యాన్ని మించే స్థాయిలో...

క్లాస్, మాస్ కలగలిసిన హీరో గోపీచంద్. ఈ రెండింటినీ మేళవించి దర్శకుడు శ్రీవాస్ తీసిన ‘లక్ష్యం’ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మళ్లీ ఈ ‘లక్ష్యం’ కాంబినేషన్‌లో సినిమా మొదలైంది.


గోపీచంద్‌తో గతంలో ‘శౌర్యం’ తీసిన వి.ఆనంద్ ప్రసాద్ భవ్య క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ స్వరాలందిస్తున్నారు. గోపీచంద్ చిత్రానికి అనూప్ పనిచేయడం ఇదే ప్రథమం. బుధవారం హైదరాబాద్‌లో ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ పూజతో మొదలయ్యాయి.

గోపీచంద్‌లోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించే విధంగా పక్కా వాణిజ్య విలువలతో, ‘లక్ష్యం’ చిత్రాన్ని మించే స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి శ్రీవాస్ కసరత్తు చేస్తున్నారు. ఏప్రిల్ 11న ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. ఇందులో గోపీచంద్ సరసన ఓ ప్రముఖ కథానాయిక నటించనున్నారు. శ్యామ్ కె. నాయుడు ఛాయాగ్రహణం చేయనున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement