అప్పుడు అనుష్క... ఇప్పుడు హన్సిక! | Hero gopichand and hansika acting to gather | Sakshi
Sakshi News home page

అప్పుడు అనుష్క... ఇప్పుడు హన్సిక!

Published Sat, Nov 26 2016 12:37 AM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM

అప్పుడు అనుష్క... ఇప్పుడు హన్సిక!

అప్పుడు అనుష్క... ఇప్పుడు హన్సిక!

డ్రైవింగ్ సీటులో హీరో... బ్యాక్ సీటులో హీరోయిన్... ఇలాంటి సీన్లు చాలా సినిమాల్లో కామన్. బట్ ఫర్ ఏ ఛేంజ్... హీరోయిన్ బండి (బైక్) నడుపుతుంటే హీరో వెనుక కూర్చునే సిత్రాలు అరుదు. సంపత్ నంది దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న సినిమాలో అటువంటి సిత్రాన్నే గోపీచంద్ చూపించనున్నారు. హీరోయిన్ హన్సిక డ్రైవింగ్ చేస్తుంటే వెనుక కూర్చొని నవ్వులు చిందిస్త్తున్నారీయన. గోపీచంద్ ఇలాంటి సీన్ చేయడం ఇది రెండోసారి. ‘లక్ష్యం’ సినిమాలో అనుష్క బండి నడుపుతుంటే, బ్యాక్ సీటులో కూర్చొని విలన్‌ని చంపే సన్నివేశాల్లో మాంచి హీరోయిజం చూపించారు.

ఇప్పుడీ సినిమాలో ఏం చేస్తారో! గోపీచంద్, హన్సిక నవ్వులు చూస్తుంటే చిత్రదర్శకుడు సంపత్ నంది లవ్ అండ్ రొమాంటిక్ సీన్లు తీసినట్టు అనిపిస్తోంది. శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె. భగవాన్, జె. పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్‌లో పూర్తయింది. ఆల్రెడీ బ్యాంకాక్‌లో ఓ షెడ్యూల్ జరిగింది. ప్రీ-క్లైమాక్స్‌తో పాటు పలు కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. క్యాథరిన్ మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement