
ఫిలింఫేర్ అవార్డుల బరిలో తెలుగు చిత్రాలివే
ఫిలింఫేర్ అవార్డులకు తెలుగు చిత్రాలు ఈసారి గట్టిగానే పోటీపడుతున్నాయి.
ఫిలింఫేర్ అవార్డులకు తెలుగు చిత్రాలు ఈసారి గట్టిగానే పోటీపడుతున్నాయి. 2013 సంవత్సరానికి గాను ఐడియా ఫిలింఫేర్ అవార్డులకు వివిధ విభాగాలలో పోటీపడుతూ నామినేషన్లు దక్కించుకున్న చిత్రాల వివరాలను ఫిలింఫేర్ ప్రకటించింది. దక్షిణాది నుంచి తెలుగులో వివిధ కేటగిరీలకు గాను నామినేషన్లు దక్కించుకున్న సినిమాలు, వ్యక్తుల వివరాలు ఇలా ఉన్నాయి..
ఉత్తమచిత్రం:
అత్తారింటికి దారేది, గుండెజారి గల్లంతయ్యిందే, మిర్చి, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, ఉయ్యాల జంపాల
ఉత్తమ దర్శకుడు
కొరటాల శివ (మిర్చి), శ్రీకాంత్ అడ్డాల (సీతమ్మ వాకిట్లో..), త్రివిక్రమ్ శ్రీనివాస్ (అత్తారింటికి దారేది), విజయ్ కుమార్ కొండా (గుండె జారి..), విరించి వర్మ (ఉయ్యాల జంపాల)
ఉత్తమ నటుడు
మహేష్ బాబు (సీతమ్మ వాకిట్లో..), నితిన్ (గుండె జారి..), పవన్ కళ్యాణ్ (అత్తారింటికి దారేది), ప్రభాస్ (మిర్చి), రామ్ చరణ్ (నాయక్)
ఉత్తమ నటి
అనుష్క (మిర్చి), నందితారాజ్ (ప్రేమకథాచిత్రం), నిత్యా మీనన్ (గుండె జారి..), రకుల్ ప్రీత్ సింగ్ (వెంకటాద్రి ఎక్స్ప్రెస్), సమంతా (అత్తారింటికి దారేది)
ఉత్తమ సంగీతం
అనూప్ రూబెన్స్ (గుండెజారి.. ), దేవిశ్రీ ప్రసాద్ (మిర్చి), దేవిశ్రీ ప్రసాద్ (అత్తారింటికి దారేది), ఎంఆర్ సన్నీ స్వామి (రా..రా), మిక్కీ జె మేయర్ (సీతమ్మ వాకిట్లో..)
ఉత్తమ సహాయనటుడు
బ్రహ్మాజీ (వెంకటాద్రి ఎక్స్ప్రెస్), ప్రకాష్ రాజ్ (సీతమ్మ వాకిట్లో..), సందీప్ కిషన్ (గుండెల్లో గోదారి), సునీల్ (తడాఖా), వెంకటేశ్ (మసాలా)
ఉత్తమ సహాయనటి
అంజలి (సీతమ్మ వాకిట్లో..), లక్ష్మి మంచు (గుండెల్లో గోదారి), నదియా (అత్తారింటికి దారేది), ప్రణీత (అత్తారింటికి దారేది), పునర్నవి (ఉయ్యాల జంపాల)
ఉత్తమ గేయరచన
అనంత శ్రీరామ్ (జాబిల్లి నువ్వే చెప్పమ్మా.. రామయ్యా వస్తావయ్యా), చంద్రబోస్ (గుండెల్లో గోదారి పొంగిపొరలుతోంది.. గుండెల్లో గోదారి), రామజోగయ్య శాస్త్రి (పండగలా దిగివచ్చావు.. మిర్చి), శ్రీమణి (ఆరడుగుల బుల్లెట్టు.. అత్తారింటికి దారేది), విశ్వ (డైమండ్ గర్ల్.. బాద్షా)
ఉత్తమ గాయకుడు
దలేర్ మెహందీ (బంతిపూల జానకి.. బాద్షా), కైలాష్ ఖేర్ (పండగలా దిగివచ్చావు.. మిర్చి), రంజిత్ (జాబిల్లి నువ్వే చెప్పమ్మా.. రామయ్యా వస్తాయ్యా), శంకర్ మహదేవన్ (బాపుగారి బొమ్మో.. అత్తారింటికి దారేది), సుచిత్ సురేశన్ (మీనాక్షి మీనాక్షి .. మసాలా)
ఉత్తమ గాయని
చిన్న పొన్ను (మిర్చి లాంటి కుర్రోడే.. మిర్చి), చిత్ర (సీతమ్మ వాకిట్లో.. సీతమ్మ వాకిట్లో), గీతామాధురి (వెచ్చని వయసు.. గుండెల్లో గోదారి), ఇందు నాగరాజ్ (ప్యార్ మే పడిపోయానే.. పోటుగాడు), శ్రేయా ఘోషల్ (హే నాయక్.. నాయక్)