
శరత్‌కుమార్‌తో మళ్లీ నెపోలియన్
సీనియర్ నటులు శరత్‌కుమార్,cccc 15 ఏళ్ల తరువాత కలిసి నటిస్తున్నారు. ఇంతకు ముందు వీరిద్దరూ కలిసి నటించిన తెన్‌కాశీపట్టణం చిత్రం మంచి విజయాన్ని సాధించింది.ఆ తరువాత తాజాగా చెన్నైయిల్ ఒరునాళ్ 2 చిత్రంలో కలిసి నటిస్తుండడం విశేషం.శరత్‌కుమార్ తాజాగా హీరోగా నటిస్తున్న ఇందులో నెపోలియన్, నటి సుహాసిని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీరిద్దరూ ఒకే చిత్రంలో నటించడం ఇదే ప్రథమం. మునీశ్‌కాంత్, అంజనాప్రేమ్, రాజసింహన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఇందులో నిశబ్ధం చిత్రం ఫేమ్ సాతన్య కీలక పాత్రను చేస్తోంది.ఇంతకు ముందు శరత్‌కుమార్ నటించిన చెన్నైయిల్ ఒరునాళ్ చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రముఖ నావల్ రచయిత రాజేశ్‌కుమార్ క్రైమ్ థ్రిల్లర్ నవల ఆధారంగా తెర కెక్కుతున్న ఈ చిత్రానికి చెన్నైయిల్ ఒరునాళ్ 2 అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు దర్శకుడు జేపీఆర్ తెలిపారు.తొలిసారిగా మెగాఫోన్ పట్టిన ఈయన చిత్రం గురించి తెలుపుతూ గత నెలలో కోవైలో చిత్ర షూటింగ్‌ను ప్రారంభించామని తెలిపారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటోందని చెప్పారు. రామ్‌మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్‌గా ఉంటుందని, త్వరలోనే చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు.