
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని జేపీఆర్ విద్యాసంస్థలు, కార్యాలయాలు, యాజమాన్యం ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ గురువారం సోదాలు జరిపింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌కు సన్నిహితుడిగా పేరున్న జేపీఆర్ చెన్నైలో పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కళాశాలలను నెలకొల్పారు. జేపీఆర్ గత ఏడాది మృతి చెందగా ఆయన కుమార్తె, అల్లుడు ఈ విద్యాసంస్థలను పర్యవేక్షిస్తున్నారు. గురువారం ఉదయం ఐటీ అధికారులు బృందాలుగా ఏర్పడి 30 చోట్ల మెరుపు దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా భారీగా లెక్క చూపని నగదు, అనేక ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment