ఎన్టీఆర్ కల నెరవేరుతుందా..? | Theaters problem for ntr nannaku prematho | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ కల నెరవేరుతుందా..?

Published Tue, Jan 5 2016 9:40 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

ఎన్టీఆర్ కల నెరవేరుతుందా..? - Sakshi

ఎన్టీఆర్ కల నెరవేరుతుందా..?

టెంపర్ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన ఎన్టీఆర్, ప్రస్తుతం చేస్తున్న నాన్నకు ప్రేమతో సినిమాతో భారీ టార్గెట్ మీద కన్నేశాడు. ఇప్పటి వరకు కెరీర్లో తనకు అందని ద్రాక్షగా ఉన్న 50 కోట్ల మార్క్ను ఈ సినిమాతో ఎలాగైనా సాధించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే ఈ సీజన్లో మాత్రం అది సాధ్యమయ్యే పరిస్థితి లేదంటున్నారు సినీ విశ్లేషకులు.

ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా సంక్రాంతి బరిలో ఐదు సినిమాలు పోటీకి దిగుతున్నాయి. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, బాలకృష్ణ డిక్టేటర్, నాగార్జున సోగ్గాడే చిన్నినాయనా, శర్వానంద్ ఎక్స్ప్రెస్ రాజా, విశాల్ కథకళి (డబ్బింగ్ సినిమా)లు సంక్రాంతి సీజన్లో రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలన్నింటిలో నాన్నకు ప్రేమతో భారీ బడ్జెట్ సినిమా. దీనిపై  అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

ఇన్ని సినిమాలు ఒకేసారి విడుదల అవుతుండటంతో థియేటర్ల సమస్య ఏర్పడే అవకాశం ఉంది. అందులోనూ నాన్నకు ప్రేమతో లాంటి భారీ చిత్రం అదే స్థాయిలో విడుదలైతే తప్ప పెట్టిన బడ్జెట్ వెనక్కి వచ్చే అవకాశం లేదు. కానీ ఈ సీజన్లో ఆ పరిస్థితి కనిపించటం లేదు. దీంతో జూనియర్ టార్గెట్ చేసిన 50 కోట్ల మార్క్ అందుకోవటం కష్టంగానే కనిపిస్తోంది. మరి ఇంత పోటీలో జూనియర్ కల నెరవేరుతుందో లేదో తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement