టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు మృతి | Tollywood Actor And Director DS Dheekshithulu Died | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

Published Mon, Feb 18 2019 7:58 PM | Last Updated on Mon, Feb 18 2019 8:03 PM

Tollywood Actor And Director DS Dheekshithulu Died - Sakshi

చిన్న పాత్రలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు దీక్షితులు అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. ఈయన పూర్తిపేరు దీవి శ్రీనివాస దీక్షిత్. కృష్ణ వంశీ దర్శకత్వంలో మహేష్ హీరోగా వచ్చిన ‘మురారి’ ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇంద్ర, ఠాగూర్, ప్రాణం, వర్షం, అతడు మొదలైన చిత్రాల్లో ఈయన ముఖ్య పాత్రలు పోషించారు. ఆయన మృతికి పలువురు సినీ, టీవీ నటులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. జూలై 28వ తేదీ 1956వ సంవత్సరంలో హనుమంతాచార్యులు, సత్యవతమ్మ దంపతులకు జన్మించిన ఈయన సంస్కత, తెలుగు భాషలలో రంగస్థల కళల్లో ఎం.ఏ. డిగ్రీలు పొందాడు. రంగస్థల నటుడిగా, అధ్యాపకుడిగా మంచి పేరు గడించారు. ఆల్ ఇండియా రేడియోలో నటుడిగా పలు నాటకాల్లో నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement