
‘టాప్’గేర్!
ఢీ అంటే ఢీ అనేలా నటనలో పోటీ నాడు. నాకేం తక్కువంటే నాకేం తక్కువనే బ్యూటీ‘ఫుల్’ ఎగ్జిబిషన్ నేడు!
ఢీ అంటే ఢీ అనేలా నటనలో పోటీ నాడు. నాకేం తక్కువంటే నాకేం తక్కువనే బ్యూటీ‘ఫుల్’ ఎగ్జిబిషన్ నేడు! సినిమాల్లో ఓకే... కొత్త కాదు గానీ... ఓ యాడ్ కోసం మోడల్, నటి కారా డెలెవింగ్నే టాప్‌లెస్‌గా నటించేసిందట. సదరు జ్యువెలరీ 2015 క్యాంపెయిన్‌లో భాగంగా ఈ ఇరవై రెండేళ్ల స్వీటీ భిన్న భంగిమల్లో పోజులిచ్చింది. ఆ ఫొటోసూట్‌లోని కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇక చెప్పేదేముంది... వెబ్‌లో షికార్లు చేస్తూ గ్లోబును చుట్టేస్తోంది. ఈ భామ ‘బోల్డ్‌నెస్’కు ప్రొడక్ట్ యజమానులు తెగు ఖుషీ అయిపోతున్నారు. ‘త్వరలో మరిన్ని... చూస్తూనే ఉండండి’ అంటూ వారూ ఓ ట్వీట్ చేశారు!