ఆ నిర్మాతలు రూ.2కోట్లు కట్టాల్సిందే!
బీజింగ్: హాలీవుడ్ మూవీ 'ట్రాన్స్ ఫార్మర్స్' నిర్మాతలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చెనా సినీక్ ఏరియాకు చెందిన ఓ పార్కుకు ఆ మూవీ నిర్మాతలు దాదాపు మూడు లక్షల అమెరికా డాలర్లు పరిహారం చెల్లించనుంది. ఆ వివరాలిలా ఉన్నాయి. ట్రాన్స్ ఫార్మర్స్: ఏజ్ ఆఫ్ ఎక్స్ టింక్షన్' మూవీలో కొన్ని సీన్లను చైనా ఉలుంగ్ సినిక్ ఏరియా, ఆ దేశ పర్యాటక ప్రాంతంలో చిత్రీకరించారు. ఇందుకు గానూ మొదట ఆ మూవీ యూనిట్ పర్మిషన్ తీసుకుంది. ఆ టూరిస్ట్ ప్లేస్ లోగో కచ్చితంగా మూవీలో చూపించాలని ఒప్పందం చేసుకున్నారు.
విడుదలైన ఈ మూవీలో పర్యాటక ప్రాంతం సీన్లున్నాయి. కానీ ఆ ఫారెస్ట్ లోగో కనిపించలేదు. దీంతో చైనాలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవీకి సంబంధించిన కొన్ని సీన్లపై చైనా అభ్యంతరం చెప్పింది. మూవీలో లోగో చూపించలేదని ఒప్పందాన్ని ఉల్లంఘించరాని చైనా వారు 2014లో దావా వేశారు. 20 మిలియన్లకు పైగా చెనీస్ యువాన్లను పరిహారం ఇప్పించాలని పేర్కొన్నారు. ఈ కేసు తీర్పు వెలువడిందని, ఆ మూవీ నిర్మాతలు చైనా పార్కుకు, సంబంధిత పర్యాటకశాఖకు 3 లక్షల డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ.2కోట్లు) చెల్లించాలని తుదితీర్పు వచ్చింది. మరోవైపు ట్రాన్స్ ఫార్మర్స్ మూవీ ఐదో పార్ట్ వచ్చే విడుదల చేసేందుకు మూవీ యూనిట్ సిద్ధంగా ఉంది.