ఇప్పటికైనా కుదురుతుందా? | Trisha or Nayanthara ! Who will suit for Saamy 2 | Sakshi
Sakshi News home page

ఇప్పటికైనా కుదురుతుందా?

Published Sun, Aug 28 2016 1:36 AM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM

ఇప్పటికైనా కుదురుతుందా?

ఇప్పటికైనా కుదురుతుందా?

 త్రిష-నయనతార.. ఈ ఇద్దరి మధ్య ఒకప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. పోటాపోటీగా సినిమాలు చేసేవాళ్లు. ఒకరి గురించి ఒకరు సన్నిహితుల దగ్గర వ్యంగ్యాస్త్రాలు విసురుకునేవాళ్లనే వార్త కూడా అప్పట్లో ప్రచారమైంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. వన్ ఫైన్ డే ఈ ఇద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారు.
 
 ఆ తర్వాత పలు ప్రైవేట్ పార్టీల్లో ఇద్దరూ కలసి దిగిన ఫొటోలు బయటికొచ్చాయి. దాంతో ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిన విషయం స్పష్టమైంది. ఈ ఫ్రెండ్స్ ఇద్దరూ ఇప్పటివరకూ కలసి నటించలేదు. తమిళంలో కొంతమంది ఈ కాంబినేషన్‌ని తెరపై చూపించడానికి ట్రై చేశారట. కానీ, అన్నీ కుదరాలి కదా. ఇప్పుడు కుదిరిందని చెన్నై కోడంబాక్కమ్ టాక్. దాదాపు పదమూడేళ్ల క్రితం విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో ‘సామి’ అనే సూపర్ హిట్ మూవీ రూపొందింది. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ చేయబోతున్నామని ఆ మధ్య హరి ప్రకటించిన విషయం తెలిసిందే.
 
  ఈ చిత్రంలోనే నయనతార, త్రిషలను కథానాయికలుగా తీసుకోవాలని హరి అనుకుంటున్నారట. ‘సామి’లో త్రిష కథానాయికగా నటించారు. ఆ చిత్రంలో ఒకే ఒక్క హీరోయిన్ ఉంటుంది. కానీ, ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ఇద్దరు నాయికలు ఉండటం సహజం అయిపోయింది. సో.. కథలో ఇంకో హీరోయిన్ పాత్రను హరి సృష్టించి ఉంటారు. మరి.. ఈ సినిమాతో అయినా త్రిష, నయనతార కాంబినేషన్ కుదురుతుందా? వేచి చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement