
1818కు ఓకే చెప్పిన చెన్నై చిన్నది
చేతి నిండా చిత్రాలతో నూతన సంవత్సరంలోకి ప్రవేశించారు చెన్నై చిన్నది త్రిష. కోలీవుడ్‌లో నయనతార తరువాత హీరోయిన్ఓరియంటెడ్ చిత్రాలు ఈ బ్యూటీనే వరిస్తున్నాయి. ఇప్పటికే నాయకి అనే కథానాయకికి ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటించిన త్రిష మోహిని అనే మరో చిత్రంలో హీరోయిన్ సెంట్రిక్ పాత్రను పోషిస్తున్నారు. త్వరలో విజయ్‌సేతుపతికి జంటగా 96 అనే చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్న త్రిషకు మరో లేడీ ఓరియంటెడ్ కథా చిత్రంలో నటించే అవకాశం వరించింది.1818 అనే చిత్రంలో నాయకిగా నటించడానికి ఈ బ్యూటీ పచ్చజెండా ఊపారు. మైండ్ డ్రామా పతాకంపై రితున్ సాగర్ దర్శక, నిర్మాతగా తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ఇది 2008లో ముంబైలో జరిగిన తీవ్రవాదుల మారణకాండ ఇతివృత్తంగా రూపొందించనున్న చిత్రం అని చెప్పారు. చిత్రం ఆధ్యంతం ఆసక్తిగా జెట్ స్పీడ్‌లో సాగుతుందన్నా రు. త్వరలో చిత్ర షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందులో త్రిషతో పాటు సుమన్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానం దం, సూదుకవ్వుం చిత్రం ఫేమ్ రమేశ్, తిలక్, రాజారాణి చిత్రం ఫేమ్ మీరా ఘోషల్ ముఖ్య పాత్రలు పోషించనున్న ఈ 1818 చిత్రానికి ఎస్‌ఎస్.తమన్ సంగీతాన్ని, మదన్ కార్గీ పాటలను అందిస్తున్నారు.