లవ్ స్టోరీతో నటి గ్రాండ్ ఎంట్రీ | TV actress Ankita Lokhande is all set to make her Bollywood debut | Sakshi
Sakshi News home page

లవ్ స్టోరీతో నటి గ్రాండ్ ఎంట్రీ

Published Thu, Jun 1 2017 6:52 PM | Last Updated on Tue, Sep 5 2017 12:34 PM

లవ్ స్టోరీతో నటి గ్రాండ్ ఎంట్రీ

లవ్ స్టోరీతో నటి గ్రాండ్ ఎంట్రీ

బెంగళూరు: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో ఇటీవలే బ్రేకప్ అయిన భామ అంకితా లోఖాండే వెండితెరకు పరిచయం కానుంది. బుల్లితెరపై ప్రముఖ నటిగా రాణిస్తున్న ఈ భామ సీనియర్ హీరో సంజయ్ దత్ నటిస్తున్న 'మలాంగ్'తో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో పోలీస్ అధికారిణిగా అంకితా కనిపించనుందని సమాచారం. గతంలో షారుక్ సరసన ఛాన్స్ వచ్చినట్లే వచ్చి చివరి నిమిషంలో చేజారడంతో కొన్ని రోజులు ఎదురుచూసిన ఈ బ్యూటీకి అదృష్టం తలుపు తట్టిందని చెప్పవచ్చు.

సుశాంత్‌తో బ్రేకప్ తర్వాత కొన్నిరోజులు ఎంతో బాధపడ్డ ఈ బ్యూటీ.. తన తొలి మూవీనే ఓ మేజర్ ప్రాజెక్టు కావడంపై హర్షం వ్యక్తం చేసింది. అయితే మలాంగ్ ఓ క్యూట్ లవ్ స్టోరీ నేపథ్యంలో సాగనున్నట్లు మూవీ యూనిట్ చెబుతోంది. ఫరాఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ న్యూ ఇయర్ లో షారుక్ ఖాన్ సరసన అంకితా ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరిగినా అది కేవలం వదంతులు అని తేలిపోయాయి. అయితేనేం సంజయ్ దత్ లాంటి అగ్రనటుడి మూవీతో అంకిత తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మూవీ షూటింగ్‌పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement