‘‘మానసిక ఒత్తిడికి నేను తలొగ్గాను. అయితే అదృష్టవశాత్తూ.. నా చుట్టూ ఉన్న స్నేహితుల వల్ల ఆ రుగ్మత నుంచి బయటపడ్డాను. దయచేసి ఎవరూ.. ఎప్పుడూ నిరాశలో కూరుకుపోవద్దు. ఒకవేళ మీరు అనుకున్నది సాధించలేకపోతే.. మరేం ఫర్వాలేదు. ఇంటికి తిరిగి వెళ్లండి’’ అంటూ నటుడు శార్దూల్ కునాల్ పండిట్ డిప్రెషన్‌తో బాధ పడుతున్న వారిలో చైతన్యం నింపాడు. కెరీర్‌లో ఎదగడానికి తాను ఎన్నోపాట్లు పడ్డానని.. ప్రస్తుతం ముంబైలో నివసించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో సొంతూరికి వచ్చేశానని పేర్కొన్నాడు. తొలుత ఓ మ్యూజిక్ చానెల్‌లో పనిచేసిన అతడు ‘కుల్‌దీప్’ షోతో యాంకర్‌గా మంచి గుర్తింపు పొందాడు. (‘సుశాంత్‌ను అందుకే తొలగించారా!’)
అప్పడు స్టెరాయిడ్స్ తీసుకున్నా
ఈ క్రమంలో స్నేహితుల సూచన మేరకు నటుడిగా అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఫిట్‌గా కనిపించేందుకు కసరత్తులు మొదలుపెట్టాడు. ఎన్నిసార్లు అడిషన్స్‌కు వెళ్లినా అతడికి నిరాశే ఎదురైంది. దీంతో విసుగెత్తిపోయిన శార్దూల్ ఎలాగైనా అవకాశం దక్కించుకోవాలని భావించి స్టెరాయిడ్స్ తీసుకున్నాడు. ఈ క్రమంలో తీవ్ర మానసిక ఒత్తిడితో పాటు పలు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో నరకం అనుభవించాడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో స్నేహితులు అతడికి అండగా నిలిచారు. వారి సహాయంతో డిప్రెషన్ నుంచి తేరుకున్న శార్దూల్ అనంతరం కొన్ని అవకాశాలు దక్కించుకున్నాడు. ఇక లాక్‌డౌన్ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా మరోసారి శార్దూల్ ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. కొన్నిసార్లు అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయేవి. దీంతో ఇంటి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితి తలెత్తడంతో స్వస్థలం ఇండోర్‌కు వెళ్లిపోయాడు. (‘నా భర్త కూడా బాధితుడే.. నేను చూశాను’)
డబ్బుల్లేవు..
ప్రస్తుతం అక్కడే ఉన్న శార్దూల్.. తనకు నకు పని ఇప్పించాలని సోషల్ మీడియా వేదికగా మూవీ ఏజెన్సీలు, మేనేజర్లను అభ్యర్థించాడు. తనకు బడా వ్యక్తులతో అంతగా పరిచయం లేదని.. కేవలం ప్రతిభ చూసి ఎంపిక చేసుకునే వారికి తను అందుబాటులో ఉంటానని చెప్పుకొచ్చాడు. చేతినిండా పని ఉన్నా లేకపోయినా ఇంటి అద్దె, ఇతరత్రా అవసరాలు ఉంటాయని.. ప్రస్తుతం తన సేవింగ్స్ కూడా అయిపోవడంతో ముంబైని వీడక తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు గురువారం ఇన్‌స్టాగ్రాంలో సుదీర్ఘ పోస్టు పెట్టాడు.
కాగా బాందిని, కుల్‌దీపక్, సిద్ధి వినాయక్ తదితర టీవీ షోలతో గుర్తింపు పొందాడు శార్దూల్. యూఏఈలో ఉద్యోగం రావడంతో 2012లో యాక్టింగ్‌ను వదిలేసిన అతడు.. నటుడిగా గుర్తింపు పొందాలనే ఆకాంక్షతో మళ్లీ ముంబైకి తిరిగి వచ్చేశానని ఓ జాతీయ మీడియాతో పేర్కొన్నాడు. అయితే తాను హోస్ట్ కొన్ని షోలు అర్ధాంతరంగా ముగియడంతో పాటుగా.. తన పేమెంట్ ఆగిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అనంతరం బీ-టౌన్‌లో తమకు ఎదురైన అనుభవాలు, డిప్రెషన్‌ను జయించిన తీరు గురించి పలువురు నటులు సోషల్ మీడయాలో పంచుకుంటున్న సంగతి తెలిసిందే.(ఇది అన్యాయం)
Comments
Please login to add a commentAdd a comment