అనధికారిక నిషేధం! | Unofficial ban on Amala? | Sakshi
Sakshi News home page

అనధికారిక నిషేధం!

Published Tue, Aug 16 2016 10:49 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

అనధికారిక నిషేధం!

అనధికారిక నిషేధం!

విడాకుల వ్యవహారం హీరోయిన్ అమలాపాల్ సినీ అవకాశాలకు ఎసరు పెడుతోందా? ఈ మలయాళీ బ్యూటీపై తమిళ చిత్రసీమ అనధికారిక బ్యాన్ విధించిందా? చెన్నై కోడంబాక్కమ్ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. తమిళ దర్శకుడు ఏ.ఎల్.విజయ్‌తో అమలాపాల్ ప్రేమ, పెళ్లి మూడేళ్లు గడవక ముందే కంచికి చేరడం.. పరస్పర అంగీకారంతో విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కడం.. ఈ వ్యవహారం మొత్తం అందరికీ తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా అమలాపాల్ పలు చిత్రాల్లో నటించారు. దర్శక-నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇస్తూ వచ్చారు.
 
 ఇప్పుడు మాత్రం అవకాశాలివ్వడానికి సుముఖంగా లేరట. దానికి కారణం ఏ.ఎల్.విజయ్ తండ్రి అళగప్పన్ అని సమాచారం. ఏ.ఎల్.అళగప్పన్ నటుడు, సీనియర్ నిర్మాత కూడా. ఆయనకు పలువురు తమిళ సినీ ప్రముఖులతో సత్సంబంధాలు ఉన్నాయి. దాంతో అమలాపాల్‌ను తమ చిత్రంలో కథానాయికగా తీసుకుంటే అళగప్పన్‌తో స్నేహానికి ఎక్కడ ఫుల్‌స్టాప్ పడుతుందో? అనే భయంతో కొందరు నిర్మాతలు వెనక్కి తగ్గుతున్నారట.
 
  ఈ పుకార్లకు బలం చేకూరుస్తూ.. విడాకులకు ముందు అమలాపాల్‌ని సంప్రదించిన కొందరు నిర్మాతలు ఇప్పుడా సినిమాల ఊసే ఎత్తడంలేదట. అళగప్పన్ సూచనల ప్రకారమే అమలాపాల్‌ని పక్కన పెడుతున్నారట. ప్రస్తుతం ధనుష్ సరసన ‘వడ చెన్నై’లో అమలాపాల్ నటిస్తున్నారు. ఒకవేళ తమిళ పరిశ్రమలో నిజంగానే ఆమెకు పరిస్థితులు అనుకూలంగా లేకపోతే అప్పుడు మాతృభాష మలయాళం, ఆదరించిన తెలుగు చిత్ర పరిశ్రమలపై అమలాపాల్ దృష్టి సారిస్తారేమో.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement