
మోస్ట్ వైరల్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?
మోడల్ గా కెరీర్ ఆరంభించి హీరోయిన్ గా మారిన వారిలో ఊర్వశీ రౌతెలా అరుదైన ఘనత దక్కించుకుంది.
ముంబై: మోడల్ గా కెరీర్ ఆరంభించి హీరోయిన్ గా మారిన వారిలో ఊర్వశీ రౌతెలా అరుదైన ఘనత దక్కించుకుంది. ఈ ఏడాది మోస్ట్ వైరల్ సెలబ్రిటీగా ఎంపికైంది. ఇటీవల జరిగిన రిలయన్స్ డిజిటల్ ఎగ్జిబిట్ టెక్ అవార్డులు 2016లో వేడుకలో ఈ పురస్కారం అందుకుంది.
యమహా ఫాసినో మిస్ దివా- 2015 మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్న ఊర్వశి పలు సినిమాల్లో నటించింది. ఈ ఏడాది జూలైలో విడుదలైన ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ సినిమా ఆమెకు పెద్దగా కలిసిరాలేదు. ఈ సినిమా రిలీజ్కు 17 రోజుల ముందే ఇంటర్నెట్ లో వచ్చేయటంతో కలకలం రేగింది. ఫలితంగా ఈ సినిమా వసూళ్లు ఊహించిన దానికన్నా చాలా తక్కువగా వచ్చాయి. దీనిపై అప్పట్లో ఊర్వశి కన్నీళ్లు పెట్టుకుంది. ‘సినిమా చూసిన వారందరూ సూపర్బ్గా చేశానని ప్రశంసించారు. నాకు సంతోషించాలో బాధపడాలో కూడా తెలియటం లేదు. ఇది హత్య చేయడం కన్నా ఎక్కువ' అంటూ ఏడ్చేసింది.