బొబ్బింగ్‌ అండ్‌ బ్లాకింగ్‌! | varun tej boxing training in los angeles | Sakshi
Sakshi News home page

బొబ్బింగ్‌ అండ్‌ బ్లాకింగ్‌!

Published Thu, Feb 7 2019 4:53 AM | Last Updated on Thu, Feb 7 2019 4:53 AM

varun tej boxing training in los angeles - Sakshi

వరుణ్‌ తేజ్‌

అప్‌రైట్‌ స్టాన్స్, సెమీ క్రౌచ్, ఫుల్‌ క్రౌచ్, జబ్, క్రాస్, హుక్, బొబ్బింగ్, బ్లాకింగ్‌... ఇదిగో ఈ పదాలనే మార్చి మార్చి పలుకుతున్నారు వరుణ్‌ తేజ్‌. స్పోర్ట్స్‌ గురించి.. అది కూడా బాక్సింగ్‌ గురించి తెలిసినవారికి ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది ఇక్కడ ప్రస్తావించిన పదాలన్నీ బాక్సింగ్‌కి సంబంధించినవి అని. హీరో వరుణ్‌ తేజ్‌ బాక్సింగ్‌ సాధన మొదలు పెట్టారు. ఈ ప్రత్యేకమైన శిక్షణ కోసం ఆయన లాస్‌ ఏంజిల్స్‌ వెళ్లారు. వరుణ్‌ తేజ్‌ హీరోగా కిరణ్‌ కొర్రపాటి అనే నూతన దర్శకుడు ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ బాక్సర్‌ పాత్ర చేయనున్నారు. ‘‘లాస్‌ ఏంజిల్స్‌లో బాక్సింగ్‌ శిక్షణ మొదలైంది’’ అంటూ తన ప్రాక్టీస్‌కి సంబంధించిన ఫొటోను బయటపెట్టారు వరుణ్‌. ఇక కిరణ్‌ కొర్రపాటి విషయానికి వస్తే... ఇంతకుముందు వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన ‘మిస్టర్, తొలిప్రేమ’ సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశారు. వరుణ్‌తో కిరణ్‌ దర్శకత్వం వహించనున్న తాజా సినిమాకు వరుణ్‌ తేజ్‌ కజిన్‌ అల్లు బాబీ (నిర్మాత అల్లు అరవింద్‌ కుమారుడు) ఒక నిర్మాత అని తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement