
ప్రస్తుతం సోషల్ మీడియలో త్రో బ్యాక్ పిక్ ట్రెండ్ నడుస్తోంది. ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రటీలు పాత ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ మెమొరీస్ రీ కలెక్ట్ చేసుకుంటున్నారు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్..తన తాత కొణిదెల వెంకట్రావుతో కలిసి ఓ విమానంలో వెళుతున్న ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. మంచి పాత జ్ఞాపకాలు.. మా తాతయ్యతో అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. రీసెంట్‌గా వరుణ్ తేజ్.. అభిమానులతో ట్విట్టర్‌లో చిట్ చాట్ చేసి వాళ్లతో తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. చాలామంది సెలబ్రెటీలు లైవ్‌చాట్‌లు చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. కరోనా ఎఫెక్ట్‌తో ఇంట్లో చేస్తోన్న యాక్టివిటీస్‌కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ వరుణ్ తేజ్.. ఎఫ్ మూవీతో పాటు గద్దలకొండ గణేష్ సినిమాలో మంచి విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు. మరోవైపు మంచి కథ దొరికితే సాయి ధరమ్ తేజ్‌తో పాటు మిగతా మెగా హీరోలందరితో సినిమాలు చేస్తానని చెప్పాడు వరుణ్ తేజ్.
Comments
Please login to add a commentAdd a comment