వీణామాలిక్ సీక్రెట్ మ్యారేజ్ | Veena Malik Gets Married To Asad Bashir Khattak In Dubai | Sakshi
Sakshi News home page

వీణామాలిక్ సీక్రెట్ మ్యారేజ్

Published Thu, Dec 26 2013 9:30 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM

వీణామాలిక్ సీక్రెట్ మ్యారేజ్

వీణామాలిక్ సీక్రెట్ మ్యారేజ్

తన అందాల ప్రదర్శనతో బాలీవుడ్ను షేక్ చేసిన పాకిస్తాన్ బ్యూటీ వీణా మాలిక్ పెళ్లి చేసుకున్నట్లు వార్తలు జోరుగా షికార్లు చేస్తున్నాయి. అసద్ బషీర్ అనే వ్యాపారవేత్తను ఈ అమ్మడు పెళ్లాడినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ  వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.తన జీవిత భాగస్వామితో ఉంగరాలు మార్చుకున్న ఫోటోలను వీణా మాలిక్ తన ట్విట్టర్ అకౌంట్లో పెట్టింది.  'ఐ ఫౌండ్ మై సోల్ మేట్... మై ఫ్రెండ్.. మై పార్టనర్!!!' అంటూ ఆమె ట్వీట్ చేసింది. ఈ రోజు తనకు చాలా సంతోషంగా ఉందని, తన ఉద్దేశ్యం ప్రకారం ప్రపంచంలోనే  హ్యాపియస్ట్ గర్ట్ తానేనంటూ చెప్పుకొచ్చింది.

కాగా వీణా మాలిక్ తన సొంత ట్విట్టర్ ఖాతాలో పొందుపరిచిన సమాచారం మేరకు అసద్ బషీర్ ఖతక్ను (డిసెంబర్ 25న) దుబాయిలోని ఎమిరేట్స్ కోర్టులో వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అతగాడి ముఖం కనిపించే ఫోటో మాత్రం ట్విట్టర్లో పెట్టలేదు.  తండ్రి అహ్మద్ అలీ మాలిక్ స్నేహితుడి కుమారుడినే వీణా పెళ్లాడినట్లు సమాచారం. అసద్ బషీర్ దుబాయిలో వ్యాపారం నిర్వహిస్తుండగా, అతని కుటుంబం నార్వేలో ఉంటోంది. త్వరలో అందరినీ పిలిచి వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేయనుందట. అయితే నిత్యం వార్తల్లో ఉండే వీణా ఎందుకిలా సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చిందో తేలాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement