నాతో నటించాలని.. ఆశ ఉంటే అలా చేయండి! | Vignesh Shivan and Nayanthara with Sivakarthikeyan | Sakshi
Sakshi News home page

నాతో నటించాలని.. ఆశ ఉంటే అలా చేయండి!

Published Mon, Feb 1 2016 4:15 AM | Last Updated on Sun, Sep 3 2017 4:42 PM

నాతో నటించాలని.. ఆశ ఉంటే అలా చేయండి!

నాతో నటించాలని.. ఆశ ఉంటే అలా చేయండి!

ప్రతిభను పక్కన పెడితే(ఎందుకంటే ఇప్పుడది చాలామందిలో ఉండదు కనుక. చాలా మంది కథానాయికలు గ్లామర్‌నే నమ్ముకుంటున్నారు కనుక) అదృష్టంతో అందలమెక్కిన వారి మాట చెల్లుబాటు అవుతుందన్నది చాలాసార్లు నిరూపణ అయ్యింది. ఇక నటి నయనతార విషయానికి వస్తే ఆమెకు అందంతో పాటు అభినయం మెండన్నది చెప్పక తప్పదు. అందాలారబోతలోనూ అందే వేసిన నయనతార నటిగా సెకెండ్ ఇన్నింగ్‌లోనూ నంబర్‌వన్ స్థానంలో వెలుగొందుతున్నారు. టాప్ స్టార్‌తోనే కాదు, వర్ధమాన హీరోలతోనూ నటిస్తూ విజయాలు అందుకుంటున్నా నయనతార ఇప్పటి వరకూ క్రేజ్‌తో పాటు పారితోషికాన్ని పెంచుకుంటూ వచ్చారు.

తాజాగా తన ప్రియుడికి సిపార్సు చేయడానికి తన స్థాయిని వాడుకుంటున్నారనే ప్రచారం చిత్ర పరిశ్రమలో  జోరందుకుంది. విషయం ఏమిటంటే ఇటీవల మాయ, తనీఒరువన్, నానూ రౌడీదాన్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన నయనతార ఈ చిత్రాలలో రెండింటిలో వర్ధమాన నటులతోనే నటించారు. కాగా నాను రౌడీదాన్ చిత్రం విజయం తరువాత ఆ చిత్ర జంట అయిన విజయ్ సేతుపతి, నయనతారలతో ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం చిత్రం చేయడానికి ప్రయత్నించినట్లు ప్రచారంలో ఉంది.

ఈ చిత్రానికి కాల్‌షీట్స్ కేటాయించే విషయమై నయనతార ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. కాగా తనీఒరువన్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత ఆ చిత్ర దర్శకుడు మోహన్‌రాజా శివకార్తీకేయన్‌తో చిత్రం చేయడానికి రేడీ అవుతున్నట్లు తెలిసింది. ఇందులో నయనతారను హీరోయిన్‌గా ఎంపిక చేయాలనుకుంటున్నట్లు సమాచారం. కాగా నటి నయనతార శికార్తీకేయన్‌కు ఫోన్ చేసి మీకు నాతో నటించాలన్న ఆశ ఉంటే విఘ్నేశ్‌శివ దర్శకత్వంలో నటించండి అని చెప్పినట్లు టాక్ స్ప్రెడ్ అయ్యింది.

అంతే కాదు  ఈ బ్యూటీ మంత్రం బాగానే పని చేసిందనీ ఇప్పుడు ఆమె బాయ్‌ఫ్రెండ్ విఘ్నేశ్ శివ దర్శకత్వంలో శివకార్తీకేయన్ నటించే విషయమై చర్చలు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. అంతే కాదు విజయ్‌సేతుపతిని పక్కన పెట్టే యుక్తిలోనూ నయనతార సఫలం అయ్యారనే ప్రచారం జోరందుకుంది. అన్నట్టు ఈ భామ చాలా గ్యాప్ తరువాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ అయ్యారు. ప్రముఖ నటుడు వెంకటేశ్ సరసన బాబు బంగారం అనే చిత్రంలో నటిస్తున్నారు. శ్రీరామరాజ్యం చిత్రం తరువాత నయనతార నటిస్తున్న తెలుగు చిత్రం ఇదేనన్నది గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement