
కొరుక్కుపేట: సెన్షేషనల్ హీరో విజయ్ దేవరకొండ పుట్టిన రోజు వేడుకలు గురువారం చెన్నైలోనూ కోలాహలంగా జరుపుకున్నారు. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలతోపాటు తమిళనాడు, కేరళ, కర్ణాటకలోని ఏడు నగరాల్లో విజయదేవరకొండ బర్త్ డే ట్రక్ ద్వారా క్రీమ్‌స్టోన్ ఐస్‌క్రీమ్ ‘ మిస్టర్ ఆల్ఫోన్స్ ’లను వేలాదిమంది అభిమానులకు పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా గురువారం చెన్నైలోని అన్నానగర్ రోడ్డు సమీపంలోని అన్నా ఆదర్శ్ కాలేజ్ వద్ద అందరికీ పంచిపెట్టారు. అలాగే నగరంలోని కోయంబేడు, అశోక్‌నగర్, గిండి కత్తిపర ఫ్‌లైఓవర్ ఏరియా, సైదాపేట ప్రాంతాల్లో బర్త్‌డే ట్రక్ వెళ్లి అక్కడ ప్రజలకు ఐస్‌క్రీమ్‌లను అందించి విజయ్ దేవరకొండ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.