‘మా ప్రేమను మీరూ ఫీల్ అవుతారు’ | Vijay Devarakonda Brother Anand Devarakonda Inteview | Sakshi
Sakshi News home page

‘మా ప్రేమను మీరూ ఫీల్ అవుతారు’

Published Tue, Jul 9 2019 4:29 PM | Last Updated on Tue, Jul 9 2019 5:02 PM

Vijay Devarakonda Brother Anand Devarakonda Inteview - Sakshi

ఆనంద్‌ దేవ‌ర‌కొండ‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌లను హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ మ‌ధురా ఎంట‌ర్‌టైన్మెంట్, బిగ్ బెన్ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించిన సినిమా దొర‌సాని. మూవీ సెన్సార్ కార్యక్రమాల‌ను పూర్తిచేసుకొని యు/ఎ స‌ర్టిఫికేట్‌ని పొందింది. కె.వి.ఆర్ మ‌హేంద్ర ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్న దొర‌సాని చిత్రం ఈ నెల 12న రిలీజ్‌కి  రెడీ అవుతున్న సంద‌ర్భంగా హీరో ఆనంద్ దేవ‌ర‌కొండ మీడియాతో ముచ్చటించారు.

దొర‌సాని గురించి
ఇది ఒక పిరియాడిక్ ల‌వ్ స్టోరీ, రాజు, దొర‌సాని మ‌ద్య జ‌రిగిన ప్రేమ‌క‌థ‌. నిజ‌జీవితానికి ద‌గ్గర‌గా ఉండే ప్రేమ‌క‌థ‌.  క‌థ‌లోని స్వచ్ఛత‌, నిజాయితీ ఈ ప్రేమ‌క‌థ‌ను ముందుకు న‌డిపిస్తాయి. అన్నీ రియ‌ల్ లోకేష‌న్స్‌లో షూటింగ్ చేసాము. ఆ క‌థ‌లోని ఆత్మను తెర‌మీద‌కు తెచ్చే ప్రయ‌త్నం చేసాం. ద‌ర్శకుడు మ‌హేంద్ర ఎక్కడా ఫేక్ ఎమోష‌న్స్‌ని రానీయ‌లేదు. క‌థ‌ను ద‌ర్శకుడు ట్రీట్ చేసిన విధానం చాలా రియ‌లిస్టిక్‌గా ఉంటుంది.

ఆ ఆఫ‌ర్స్ ని సీరియ‌స్ గా తీసుకోలేదు
అన్నయ్య (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) అర్జున్ రెడ్డి త‌ర్వాత కొన్ని ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. కానీ అప్పుడు సీరియ‌స్‌గా తీసుకొలేదు. ఇండియాకి అన్నయ్య బిజినెస్‌ని స‌పోర్ట్ చేద్దామ‌ని వ‌చ్చాను. యూఎస్‌కి వెళ్ళకు ముందు థియేట‌ర్స్ చేసాను. యాక్టింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ ఉందికానీ సినిమా ఎక్స్పీరియ‌న్స్ లేదు. ఆ టైంలో ద‌ర్శకుడు మ‌హేంద్రను క‌లిశాక సినిమా మీద ఉన్న భ‌యాలు పోయాయి. ఆయ‌న 5 గంట‌లు క‌థ చెప్పాడు. ఆ క‌థ‌ను చెప్పిన తీరులోనే నాకు అర్దం అయ్యింది. ప్రతీ పాత్ర రియ‌ల్‌గా ఉంటుంది. క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్, సిద్ధిపేట, కోదాడ దగ్గర‌లోని గ‌డిలో ఎక్కువ రోజులు షూట్ చేసాము.

అన్న టెన్షన్ ప‌డ్డాడు
సినిమా చూసే ముందు అన్న టెన్షన్ ప‌డ్డాడు. కానీ సినిమా చూసిన త‌ర్వాత చాలా ఆనంద ప‌డ్డాడు. సినిమా చూసిన త‌ర్వాత నాకు అన్న ఇచ్చిన ఎన‌ర్జీ కాన్ఫిడెన్స్‌ని పెంచింది.

 
ఆడిష‌న్స్ ద్వారా సెలెక్ట్ అయ్యాము
విజ‌య్ దేవ‌రకొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌రకొండ ఒక‌డు ఉన్నాడు అని సినిమా స‌ర్కిల్‌లో తెలుసు. ఈ క‌థ కోసం ఆర్టిస్ట్‌ల‌ను వెతుకుతున్నప్పుడు న‌న్ను ట్రై చేద్దాం అనుకున్నారు. నేను, శివాత్మిక ఆడిష‌న్స్ చేసాము. ఆ క్యారెక్టర్స్‌కి ఫిట్ అవుతాము అనే న‌మ్మకం ద‌ర్శక‌, నిర్మాత‌ల‌కు వ‌చ్చాకే మేము ప్రాజెక్ట్‌లోకి వ‌చ్చాము.

శివాత్మికను అందుకే క‌ల‌వ‌లేదు
ఈ కథ‌లో రాజు, దేవ‌కి పాత్రల మ‌ద్య ఎక్కువ చ‌నువు ఉండ‌దు. అందుకే మాకు వ‌ర్క్ షాప్‌లు విడివిడిగా నిర్వహించారు.  షూటింగ్ లోకేష‌న్‌లో కూడా పాత్రల మ‌ద్య గ్యాప్‌ను మెయిన్ టైన్ చేసాము. మేము ప్రెండ్స్ అయితే ఆ ఫీల్ స్క్రీన్ మీద‌కు వ‌స్తుంద‌ని ఆ జాగ్రత్త తీసుకున్నాము. ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ అయ్యాము.

అన్న నాకు ధైర్యం  ఇచ్చాడు
అన్న చాలా స్ట్రగుల్స్‌ చూసాడు. కానీ అన్నకు వ‌చ్చిన స‌క్సెస్ నాకు ధైర్యాన్నిచ్చింది. టాలెంట్ ఉంటే స‌క్సెస్ అవ్వొచ్చు అనే న‌మ్మకం క‌లిగింది. కానీ నా ప్రతిభే న‌న్ను నిల‌బెడుతుంద‌ని నాకు తెలుసు. ఒక బ్రద‌ర్‌గా తన స‌పోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది, కానీ స్టార్‌గా కాదు. అన్నతో పోలిక‌ల‌న్నీ సినిమా త‌ర్వాత పోతాయి అని న‌మ్ముతున్నాను.

నా పాత్ర హీరోలాగా ఉండ‌దు
ఇందులో నాపాత్ర చాలా రియ‌లిస్టిక్‌గా ఉంటుంది. రాజు చాలా స‌హాజంగా అనిపిస్తాడు. దొర‌సానిని ప్రేమించిన రాజు లాగా క‌న‌ప‌డ‌తాను. చేసిన పాత్రలు రియ‌ల్ లైఫ్ పాత్రల‌ను ప్రతిబింబిస్తే చాలు ప్రేక్షకులు క‌నెక్ట్ అవుతార‌ని న‌మ్ముతాను.


అన్న మాట్లాడుతుంటే క‌న్నీళ్ళు వ‌చ్చాయి
ఇంట్లో అంద‌రం ప్రాక్టిక‌ల్‌గా ఉంటాము. ఎమోష‌న‌ల్ టాక్స్ త‌క్కువ‌. కానీ అన్న నాగురించి మాట్లాడుతుంటే ఎమోష‌న‌ల్ అయ్యాను. ఎందుకంటే త‌మ్ముడ్ని చూసుకోవాల‌ని అన్నకు ఉంటుంది. కానీ నా క‌ష్టం నేను ప‌డాలి, నా క‌థ నేను వెతుక్కొవాలి అని అన్న అనుకున్నాడు. స్టేజ్ మీద అలా మాట్లాడుతుంటే నేను అన్నలాగే ఫీల్ అయ్యాను. అన్నది ప‌దేళ్ళ ప్రయాణం. అందులో చాలా చూసాడు. అన్నతో పాటు ఒక సారి ఆడిష‌న్స్‌కి వెళ్ళాను. సెలెక్ట్ అవ‌లేదు ఆ రోజు అన్న ఎంత బాధ ప‌డ్డాడో నేను ద‌గ్గర‌ నుండి చూసాను. నాన్న సీరియ‌ల్స్ డైరెక్ట్ చేసేవారు, ఇంట్లో రోజూ సినిమా గురించి డిస్కష‌న్స్ ఉండేవి.

సినిమా ముందు వ‌చ్చే కామెంట్స్ ని ప‌ట్టించుకోను
సోష‌ల్ మీడియాలో వ‌చ్చే కామెంట్స్‌ని సీరియస్‌గా తీసుకోను. సినిమా రిలీజ్ అయ్యాక నా న‌ట‌న మీద వ‌చ్చే విమ‌ర్శల‌ను తీసుకుంటాను. సినిమాపై పూర్తి న‌మ్మకం ఉంది.

ఇది స్వచ్చమైన ప్రేమ‌క‌థ
ఇందులో మా ప్రేమ‌క‌థ స్వచ్చంగా ఉంటుంది. యాక్షన్, యాంగ‌ర్ అలాంటివి ఏమీ ఉండ‌వు.  లిప్ లాక్‌లు అంత ఇపార్టెంట్ కావు. మా ప్రేమ‌క‌థ‌లో చాలా ట‌ర్న్స్ ఉంటాయి. మా ప్రేమ‌ను మీరు ఫీల్ అవుతారు. ద‌ర్శకుడు మ‌హేంద్ర  గ్రేట్ స్టోరీ టెల్లర్. మా క‌థ‌లోని అన్ని క్యారెక్టర్స్‌ మీద అత‌నికి పూర్తి క్లారిటీ ఉంది. అత‌ను మంచి ద‌ర్శకుడిగా నిల‌బ‌డ‌తాడు.

నిర్మాతలు పూర్తి స్వేచ్ఛ నిచ్చారు
కథను ఓకే చేసాక నిర్మాతలు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు. అంతా కొత్త వాళ్లమే అయినా మాపై పూర్తి నమ్మకం ఉంచారు. మా బాద్యతను మరింత పెంచారు. ఫైనల్ ప్రొడక్ట్ చూసి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement