‘దొరసాని’ లుక్‌ ఇదే! | Dorasani Firstlook Poster | Sakshi
Sakshi News home page

‘దొరసాని’ లుక్‌ ఇదే!

May 30 2019 1:58 PM | Updated on Jul 7 2019 11:45 AM

Dorasani Firstlook Poster - Sakshi

సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దొరసాని పేరుతో తెరకెక్కుతున్న సినిమాతో ఆనంద్‌తో పాటు హీరో రాజశేఖర్‌ రెండో కూతురు శివాత్మిక హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో హీరో హీరోయిన్ల లుక్‌తో పాటు టీజర్‌ రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటించారు.

కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వంలో ఎమోషనల్‌ లవ్‌స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను జూన్‌ 6న రిలీజ్ చేయనున్నారు. పెళ్లి చూపులు నిర్మాత యష్ రంగినేని, మధుర శ్రీధర్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూలై 5న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఒకే సినిమాతో ఇద్దరు స్టార్‌ వారసులు పరిచయం అవుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement