‘మధుర’ శ్రీధర్, మహేంద్ర, సురేష్‌బాబు
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘దొరసాని’. ఇంకో విశేషం రాజశేఖర్–జీవితా దంపతుల కుమార్తె శివాత్మిక ఇందులో కథానాయికగా నటించడం. కె.వి.ఆర్. మహేంద్ర దర్శకత్వంలో డి. సురేష్‌బాబు సమర్పణలో మధుర శ్రీధర్‌రెడ్డి, యశ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ధీరజ్ మొగిలినేని ఈ సినిమాకు సహ–నిర్మాత. ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసిన డి. సురేష్‌బాబు మాట్లాడుతూ– ‘‘టీజర్‌లో విజువల్స్ చాలా ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. ఈ సినిమా కథ రెడీ అవుతున్నప్పటి నుంచి నాకు తెలుసు.
ఒక అందమైన ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి టీమ్ అందరూ బాగా శ్రమించారు. హీరో హీరోయిన్ల పాత్రలు హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. దొరసాని గుర్తుండిపోయే కథ అవుతుందని నా నమ్మకం’’ అన్నారు. ‘‘నాలుగేళ్ల క్రితం మొదలైన ‘దొరసాని’తో నా జర్నీ ఇంతవరకు రావడానికి కారణం సురేష్‌బాబు, ‘మధుర’ శ్రీధర్‌గార్లు. పదికాలాలు గుర్తుండిపోయే ప్రేమకథగా దొరసాని నిలిచిపోతుంది’’ అన్నారు మహేంద్ర. ప్రముఖ దర్శకులు, మార్గదర్శకులు డి. రామానాయుడు జయంతి రోజున దొరసాని టీజర్ విడుదల కావడం సంతోషంగా ఉంది. మహేంద్ర క్లారిటీ ఉన్న దర్శకుడు’’ అన్నారు ‘మధుర’ శ్రీధర్.
Comments
Please login to add a commentAdd a comment