
శివాత్మిక రాజశేఖర్, ఆనంద్ దేవరకొండ
తోట రాముడు, కోటలో మహారాణి. ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. ఆ ప్రేమను ఎలా గెలిపించుకున్నారు అనే కథాంశంతో ఎన్నో ప్రేమకథలొచ్చాయి, మన మనసుని గెలుచుకున్నాయి. తాజాగా పెద్దింటి అమ్మాయి, పేదింటి అబ్బాయి ప్రేమకథగా తెరకెక్కిన చిత్రం ‘దొరసాని’. రాజశేఖర్, జీవితల రెండో కుమార్తె శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్‌గా, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా ఈ చిత్రం తెరకెక్కింది.
సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో ‘మధుర’ శ్రీధర్, యష్ రంగినేని నిర్మించిన ఈ చిత్రం ద్వారా కేవీఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను గురువారం విడుదల చేశారు. ‘‘80వ దశకంలో తెలంగాణలో జరిగిన కథగా ఈ చిత్రం రూపొందింది. జూన్ 6న టీజర్ రిలీజ్ చేస్తాం. జూలైలో చిత్రం రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సన్నీ కూరపాటి, సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి.
Comments
Please login to add a commentAdd a comment