
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మరో ఇంట్రస్టింగ్ సినిమాలో నటించనున్నాడు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్‌తో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న విజయ్ తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్‌లో పెట్టినట్టుగా తెలుస్తోంది. తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై డైరెక్షన్‌లో ఓ ట్రై లింగ్యువల్ మూవీ చేసేందుకు విజయ్ ఓకె చెప్పాడట. ఈ సినిమాను తెలుగు, తమిళ్‌తో పాటు కన్నడలోనూ ఒకే సారి తెరకెక్కిస్తున్నారు.
భారీ బడ్జెట్‌తో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ప్రీపరేషన్స్ కూడా మొదలు పెట్టేశాడు విజయ్. ఈ సినిమాలో బైక్ రేసర్‌గా నటించేందుకు కావాల్సిన ట్రైనింగ్ తీసుకుంటున్నాడు విజయ్. తమిళనాడు లోని రేసింగ్ ట్రాక్స్ మీద తెగ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ తొలి షెడ్యూల్‌లోనే ఢిల్లీలో బైక్ రేసింగ్ దృశ్యాలను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment