మరోసారి నానుమ్‌ రౌడీదాన్‌ కాంబినేషన్‌ | Vijay Sethupathi Nayanthara again pair in Imaikka Nodigal | Sakshi
Sakshi News home page

మరోసారి నానుమ్‌ రౌడీదాన్‌ కాంబినేషన్‌

Published Thu, Dec 15 2016 2:52 AM | Last Updated on Mon, Sep 4 2017 10:44 PM

మరోసారి నానుమ్‌ రౌడీదాన్‌ కాంబినేషన్‌

మరోసారి నానుమ్‌ రౌడీదాన్‌ కాంబినేషన్‌

 నానుమ్‌ రౌడీదాన్‌ చిత్రం సాధించిన విజయం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రానికి ఆది నుంచి ప్రత్యేకత సంతరించుకోవడానికి కారణం టాప్‌ కథానాయకిగా వెలుగొందుతున్న నయనతార యువ నటుడు విజయ్‌సేతుపతికి జంటగా నటించడమే. కేవలం నయనతార కారణంగానే ఆ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు అనువాద చిత్రంగా వెళ్లిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి ఉండదు. అలాంటి కాంబినేషన్‌ను తమిళ ప్రేక్షకులు మరోసారి చూడబోతున్నారన్నది తాజా సమాచారం. నయనతార తాజాగా ఇమైక్కా నోడిగళ్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు.

 ఇంతకు ముందు డిమాంటికాలనీ వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాన్ని తెరకెక్కించిన అజయ్‌ జాన్‌ముత్తు ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో హీరోగా అధర్వ నటిస్తున్నారు. నయనతార ఆయనకు అక్కగా నటిస్తున్నారని సమాచారం. ఆమెకు పెయిర్‌గా విజయ్‌సేతుపతి నటించనున్నారన్నది తాజా సమాచారం. అయితే ఇందులో విజయ్‌సేతుపతి గెస్ట్‌గానే కనిపించనున్నారట. అయినా తన పాత్రకు ప్రాముఖ్యత ఉండడంతోనే ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. మొత్తం మీద నయనతార, అధర్వలకు విజయ్‌సేతుపతి తోడవడంతో ఇమైక్కా నోడిగళ్‌ చిత్రానికి మరింత క్రేజ్‌ పెరిగిందనే చెప్పవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement