
తమిళ చిత్రం ‘96’ టీజర్‌లో డైలాగ్స్ పెద్దగా ఉండవు. ఓ ఎమోషన్ కనిపిస్తుంది. ఇప్పుడీ సినిమాలోని డైలాగ్స్ వినే అవకాశం రాబోతోంది. అదేనండీ.. సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారని చెబుతున్నాం. విజయ్ సేతుపతి, త్రిష జంటగా సి. ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘96’.
ఈ సినిమా అక్టోబర్ 4న రిలీజ్ కానుంది. ఇందులో జాను అనే టీచర్ పాత్రలో త్రిష కనిపిస్తారట. విజయ్ సేతుపతి కెమెరామెన్‌గా కనిపించనున్నారని టీజర్‌లో హింటిచ్చారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘పేట్టా’లో త్రిష ఓ కథానాయికగా చేస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment