
చిరంజీవితో చిత్రం కథపై మార్చికి స్పష్టత
అమలాపురం: మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం కథకు సంబంధించిన సిట్టింగ్ వచ్చే నెలలో జరుగుతుందని, మార్చి నాటికి చిత్రంపై స్పష్టత వస్తుందని ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ చెప్పారు.
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడిలో ఆదివారం ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన అమలాపురంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్పను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.