‘తృటిలో ప్రాణాలతో బయటపడ్డా’ | When Britney Spears escaped death in Hawaii | Sakshi
Sakshi News home page

‘తృటిలో ప్రాణాలతో బయటపడ్డా’

Published Wed, Aug 24 2016 11:21 AM | Last Updated on Thu, Jul 11 2019 7:49 PM

‘తృటిలో ప్రాణాలతో బయటపడ్డా’ - Sakshi

‘తృటిలో ప్రాణాలతో బయటపడ్డా’

లండన్: మృత్యువు నుంచి తృటిలో తప్పించుకున్నానని పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ వెల్లడించింది. సెలవులు గడిపేందుకు హవాయ్ వెళ్లినప్పుడు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డానని తెలిపింది. సముద్రంలో మునిగిపోబోతున్న తనను అంగరక్షకులు కాపాడారని 34 ఏళ్ల ‘టాక్సిస్’  స్టార్ చెప్పింది.

‘హవాయ్ బీచ్ లో సముద్రంలోకి దిగినప్పుడు హాయ్ గా అనిపించింది. సముద్రతీరం చాలా అందంగా కనిపించింది. కెరటాలతో కేరింతలు కొడుతుండగా ఆరు అడుగుల అల అమాంతంగా నన్ను సముద్రంలోకి లాక్కుపోయింది. నేను మునిగిపోతున్నానని గట్టిగా కేకలు పెట్టాను. ఐదు నిమిషాలు పాటు ఏం జరిగిందో అర్థం కాలేదు. తర్వాత చూస్తే సెక్యురిటీ సిబ్బంది నన్ను ఒడ్డుకు చేర్చినట్టు అర్థమైంది. నీటిలో మునిగిపోకుండా వారు నన్ను రక్షించార’ని బీబీసీ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement